Break Up: ఇదెక్కడి లవ్‌స్టోరీ తల్లి.. రీల్స్‌కు లైక్ కొట్టలేదని బ్రేకప్.. మధ్యలో దోమ కథ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-11-27T21:35:38+05:30 IST
ప్రస్తుత టీనేజర్ల లవ్‌స్టోరీలు చాలా ఫన్నీగా ఉంటున్నాయి.. కలిసి తిరిగినంత కాలం తిరిగి ఆ తర్వాత సిల్లీ కారణాలతో బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు.. ఎవరి బంధం ఎంత కాలంలో ముగుస్తుందో అంచనా వేయడం కష్టం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ 16 ఏళ్ల బాలిక బ్రేకప్ స్టోరీ వింటే నవ్వు రాకమానదు.
ప్రస్తుత టీనేజర్ల లవ్‌స్టోరీలు (Love Story) చాలా ఫన్నీగా ఉంటున్నాయి.. కలిసి తిరిగినంత కాలం తిరిగి ఆ తర్వాత సిల్లీ కారణాలతో బ్రేకప్ (Break Up) చెప్పేసుకుంటున్నారు.. ఎవరి బంధం ఎంత కాలంలో ముగుస్తుందో అంచనా వేయడం కష్టం.. లవ్, బ్రేకప్ మొదలైన విషయాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకేలా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ 16 ఏళ్ల బాలిక బ్రేకప్ స్టోరీ వింటే నవ్వు రాకమానదు. ఆమె తన ప్రేమకథలో దోమను కూడా విలన్‌ను చేసింది. తన కథను స్వయంగా ఆ బాలిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది (Funny Break Up Story).
``నాకు ప్రేమ, డేటింగ్ పట్ల అంతగా ఆసక్తి లేదు. కానీ నా ఫ్రెండ్ హర్షిత్ నన్ను అమితంగా ఆకట్టుకున్నాడు. అయినా నేను 6 నెలలు వెయిట్ చేసిన తర్వాతే హర్షిత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఆ తర్వాత హర్షిత్ నిజస్వరూపం నాకు తెలిసింది. నేను పోస్ట్ చేసిన రీల్స్‌కు లైక్స్ కొట్టలేదు. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదు. అనుష్కను విరాట్ కోహ్లి ఎలా చూసుకుంటాడో, ఆ విధంగా హర్షిత్ నన్ను చూసుకోలేదు. తర్వాత ఒకరోజు హర్షిత్ మీద కోపంతో అతని క్లాస్‌రూమ్‌కి వెళ్లి అతని చెంపపై గట్టిగా కొట్టాన``ని వెల్లడించింది.
Social Media: చనిపోయేముందు ఆ మహిళ రాసిన వీలునామా చెల్లదంటూ సంచలన తీర్పు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
``నేను కొట్టే సమయంలో హర్షిత్ చెంప మీద ఒక దోమ (Mosquito) ఉంది. నా కొట్టిన దెబ్బకు ఆ దోమ చనిపోయింది. ఇప్పుడు ఆ దోమ ఫ్యామిలీ నా కలలోకి వస్తోంది. నాపై పగబట్టిన ఆ దోమ ఫ్యామిలీ పగ తీర్చుకోవాలని చూస్తోంది. నాకు డెంగ్యూ రావాలని దోమ ఫ్యామిలీ కోరుకుంటోంద``ని ఆ బాలిక రాసింది. ఆ బాలిక రాసిన ఈ ఫన్నీ బ్రేకప్ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది యూజర్లు ఈ పోస్ట్‌పై ఫన్నీగా స్పందిస్తున్నారు.