Viral Video: బిడ్డ జోలికొస్తే పులినైనా ఎదురిస్తా.. పులిని పరిగెత్తించిన ఆవు.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-04-23T16:20:40+05:30 IST
సాధారణంగా పులులు, సింహాలంటే ఇతర జంతువులన్నీ భయపడతాయి. వాటిని చూడగానే భయంతో పారిపోతాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఆవు.. పులినే పరిగెత్తించింది. తన బిడ్డ జోలికొచ్చిన పులిని భయపెట్టి తరిమేసింది.
సాధారణంగా పులులు, సింహాలంటే ఇతర జంతువులన్నీ భయపడతాయి. వాటిని చూడగానే భయంతో పారిపోతాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) ఆవు (Cow).. పులి (Tiger)నే పరిగెత్తించింది. తన బిడ్డ జోలికొచ్చిన పులిని భయపెట్టి తరిమేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఇటీవలి కాలంలో అరణ్యాలు తగ్గిపోవడం వల్ల వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసం గ్రామాలపై పడుతున్నాయి.
గొర్రెలు, మేకలు మొదలైన వాటిని ఎత్తుకెళ్లిపోతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ పులి.. ఓ గ్రామంలోని బీడు భూమిలో ఉన్న ఆవుల మందపై దాడి చేసింది. ఓ లేగ దూడను (calf) చేజిక్కించుకుంది. దానిని చంపేందుకు ప్రయత్నిస్తుండగా ఆ లేగ దూడ తల్లి పరుగులు పెడుతూ వచ్చింది. తీవ్ర ఆగ్రహంతో వస్తున్న ఆవును చూసి పులి భయపడింది. పులి తరముకొస్తుండడంతో ఆ దూడను వదిలి పులి పారిపోయింది. ఈ వీడియోను IFS అధికారి సుశాంత నంద ట్విటర్‌లో షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు.
Viral News: కొద్ది రోజుల్లో పెళ్లనగా ఆస్పత్రికెళ్లిన వధువు.. డాక్టర్లు చెప్పింది విని భారీ షాక్.. ఇక నన్నెవరూ చేసుకోరు అని ఫిక్సయింది కానీ..
``ప్రపంచంలోని మొత్తం పులులలో 75 శాతం అంటే దాదాపు 3200 పులులు మన దేశంలోనే ఉన్నాయి. భవిష్యత్తులో వాటి సంఖ్య మరింత పెరుగుతుంది. పులుల సంఖ్య చూసి ఆనందించడం కాదు.. వాటికి సరైన ఆవాసాలు కల్పించకపోతే మానవులకు చాలా ముప్పు వాటిల్లుతుంద``ని సుశాంత నంద ట్వీట్ చేశారు.