Viral News: 111 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ షిప్ గురించి వెలుగులోకి మరో కొత్త విషయం.. వైరల్‌గా మారిన ఈ ఫొటోలో..

ABN , First Publish Date - 2023-04-19T14:23:04+05:30 IST

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వందల సంఖ్యలో వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని నెటిజన్లను ఆకట్టుకుని వైరల్‌గా మారుతాయి. ముఖ్యంగా వందల ఏళ్ల నాటి పాత విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.

Viral News: 111 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ షిప్ గురించి వెలుగులోకి మరో కొత్త విషయం.. వైరల్‌గా మారిన ఈ ఫొటోలో..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వందల సంఖ్యలో వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని నెటిజన్లను ఆకట్టుకుని వైరల్‌గా (Viral) మారుతాయి. ముఖ్యంగా వందల ఏళ్ల నాటి పాత విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం 111 ఏళ్ల క్రితం నాటి టైటానిక్ ఓడకు (Titanic Ship)సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ (Viral Photo) అవుతోంది.

టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు బయటపడని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఆ భారీ ఓడ గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఆ ఓడలో ప్రయాణించిన వారికి సిబ్బంది అందించిన ఆహార వివరాలకు (Titanic Food Menu) సంబంధించిన జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1912, ఏప్రిల్ 15న టైటానిక్ ఓడలోని ప్రయాణికులకు ఏమి వడ్డించారో తెలిపే ఫుడ్ మెనూ అది.

Township On Bridge: ఏం ఐడియా గురూ.. బ్రిడ్జిపైన ఓ టౌన్‌షిప్‌నే కట్టేశారుగా.. ఐడియా బాగానే ఉంది కానీ..!

ఆ మెనూలో ``చికెన్ కర్రీ, బేక్ చేసిన చేపలు, మటన్, రోస్ట్ టర్కీ, ఉడికించిన బంగాళాదుంపలు`` మొదలైన ఆహార పదార్థాలు కనిపించాయి. అంతేకాదు టైటానిక్‌లో ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ప్రయాణికుల డైనింగ్ రూమ్స్‌కు సంబంధించిన సమాచారం కూడా అందులో ఉంది. ఈ మెనూ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. టైటానిక్ ఓడ నేపథ్యంలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) టైటానిక్ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-04-19T14:49:34+05:30 IST