Samantha: షూటింగ్‌లో గాయపడిన సామ్.. యాక్షన్ ఫలితమిదంటూ..
ABN , First Publish Date - 2023-02-28T13:58:25+05:30 IST
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటోంది. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు సైతం చేస్తోంది. అందులో ‘సిటాడెల్’ (Citadel) అనే వెబ్‌సిరీస్‌లో కూడా ఉంది.
ఆ హిందీ వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత కలిసి నటిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శక ద్వయం రాజ్, డికే (Raj and DK) ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సమంత పలు యాక్షన్ సన్నీవేశాల్లో నటించాల్సి ఉంది. దీని కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర ప్రత్యేకంగా ట్రెనింగ్ కూడా తీసుకుంది. అనంతరం షూటింగ్‌లో పాల్గొన్న సామ్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ.. సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని షేర్ చేసింది. అందులో రెండు చేతులకి గాయాలున్నాయి. దానికి.. ‘యాక్షన్ ఫలితం’ అంటూ కామెంట్ కూడా రాసుకొచ్చింది.
కాగా.. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రుస్సో బ్రదర్స్ తీస్తున్న ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌కి ఇది భారతీయ అడాప్షన్. ఓరిజినల్ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మడ్డెన్, స్టాన్లీ టుస్సీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి:
Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’
Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు
Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్
Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్