Township On Bridge: ఏం ఐడియా గురూ.. బ్రిడ్జిపైన ఓ టౌన్‌షిప్‌నే కట్టేశారుగా.. ఐడియా బాగానే ఉంది కానీ..!
ABN , First Publish Date - 2023-04-19T12:43:55+05:30 IST
ప్రముఖ పారిశ్రామికవేత్తలు హర్ష్ గోయెంకా, ఆనంద్ మహీంద్రా తరచుగా సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు చాలా మందిని ఆకట్టుకుంటాయి. తమకు ఫన్నీగా అనిపించినవాటిని, అద్భుతం అనిపించినవాటిని తమ ఫాలోవర్లతో పంచుకుంటారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తలు హర్ష్ గోయెంకా (Harsh Goenka), ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తరచుగా సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు చాలా మందిని ఆకట్టుకుంటాయి. తమకు ఫన్నీగా అనిపించినవాటిని, అద్భుతం అనిపించినవాటిని తమ ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఓ వీడియో కూడా అలాగే వైరల్ అవుతోంది. చైనాలోని (China) చాంగ్ ఖింగ్ నగరంలో నిర్మించిన ఓ బ్రిడ్జ్ టౌన్‌షిప్‌నకు (Township On Bridge) సంబంధించిన వీడియోను గోయెంకా షేర్ చేశారు.
ఆ వీడియోలో నీటిపై నిర్మించిన ఓ బ్రిడ్జ్‌పై రకరకాల రంగుల్లో వరుసగా నిర్మించిన ఇళ్లు కనిపిస్తున్నాయి. 400 మీటర్ల పొడవైన బ్రిడ్జ్‌పై ఎన్నో ఇళ్లు, భవనాలు నిర్మించినట్టు ఆ వీడియోను బట్టి తెలుస్తోంది. రకరకాల పద్ధతుల్లో కట్టిన ఇళ్లు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోను షేర్ చేసిన గోయెంకా.. ``అక్కడ జీవనాన్ని ఊహించండి`` అని కామెంట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: వారెవ్వా.. ఇదేం కారు.. ధగధగా మెరిసిపోతోంది కదా అని దగ్గరకు వెళ్తే షాకింగ్ ట్విస్ట్.. కారు యజమాని తెలివికి హ్యాట్సాఫ్..!
``చాంగ్ ఖింగ్ నగరంలో బ్రిడ్జ్‌లు, రైలు మార్గాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కట్టిన ఈ ఇళ్లు బాగా ఆకట్టుకుంటున్నాయ``ని ఒకరు కామెంట్ చేశారు. ``చూడడానికి బాగానే కనిపిస్తున్నాయి. కానీ, అక్కడ జీవించడం మాత్రం కష్టమే`` అని మరొకరు పేర్కొన్నారు.