Viral Video: నేను దేశభక్తుడిని.. మోదీ భక్తుడిని కాదు.. ట్రైన్‌లో పొలిటికల్ పంచ్‌లు పేల్చుతున్న చిరు వ్యాపారి.. అతడిని ఎందుకు అరెస్ట్ చేశారంటే..
ABN , First Publish Date - 2023-03-05T20:04:17+05:30 IST
రైలులో ప్రయాణం చేస్తున్నపుడు టైమ్ పాస్ కోసం ప్రయాణికులు రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటారు. అందులో రాజకీయ అంశాలే ఎక్కువగా ఉంటాయి.
రైలులో ప్రయాణం చేస్తున్నపుడు టైమ్ పాస్ కోసం ప్రయాణికులు రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటారు. అందులో రాజకీయ అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఎవరికి ఇష్టమైన రాజకీయ నేత గురించి వారు మాట్లాడతారు. ప్రయాణికులు మాత్రమే కాదు.. రైలులో చిరుతిళ్లు అమ్ముకునే వ్యక్తులు కూడా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తమ విన్యాసాలను ప్రదర్శిస్తుంటారు. అవధేష్ దూబే (Avdhesh Dubey) అనే వ్యక్తి రైలులో స్నాక్స్ అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. అయితే తన పొలిటికల్ సెటైర్లతో (Political Satires) ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. అతడి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యాయి.
జియో డేటా, సోనియా బేటా (రాహుల్) కేవలం వినోదం కోసం మాత్రమే, నేను మోదీ భక్తుణ్ని కాదు.. దేశ భక్తుణ్ని మాత్రమే.. కానీ, ప్రస్తుతం దేశభక్తి అనేది మోదీ భక్తికి (Modi Bhakt) ప్రత్యామ్నాయంగా మారిపోయింది అంటూ అవధేష్ మాట్లాడిన వీడియో కొంత కాలం క్రితం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. లైసెన్స్ లేకుండా ట్రైన్‌లో స్నాక్స్ అమ్ముతున్నాడని ఆ తర్వాత అవధేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి 15 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత ఏం జరిగిందో కూడా అవధేష్ తనదైన ఫన్నీ స్టైల్లో చెప్పాడు.
మరిది ఫోన్‌లో ఓ వీడియో చూసి వదిన షాక్.. వెంటనే పోలీసులకు కంప్లైంట్.. అసలు విషయమేంటో తెలిస్తే..
``నన్ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు.. రైలులో విక్రయించడానికి నీకు లైసెన్స్ (Licence to sell in train) ఉందా అని అడిగారు. అలాంటి లైసెన్స్ ఎక్కడైనా అందుబాటులో ఉంటే నాకు సహాయం చేయమని అడిగాను. నేను 15 సంవత్సరాలుగా రైళ్లలో స్నాక్స్ అమ్ముకుంటున్నాను. కానీ ఇప్పటికీ లైసెన్స్ పొందలేకపోయాను. దయచేసి నాకు ఒకటి ఇప్పించండి అని న్యాయమూర్తిని అడిగినట్టు`` ఆ వీడియోలో దూబే పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.’