Travelers: తరచూ ప్రయాణాలు చేసే అలవాటు ఉన్న వాళ్లు.. ఈ 10 వస్తువులను మాత్రం అస్సలు మర్చిపోరట..!
ABN , First Publish Date - 2023-10-16T13:33:37+05:30 IST
కొందరు అప్పటికిప్పుడు ప్రయాణమన్నా సరే చకచకా అన్ని సర్జేసుకుంటారు. ప్రయాణం ముగిసి ఇంటికి చేరేవరకు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోరు. దీని వెనుక కారణం వారి ఎంపికలే..
ప్రయాణం పేరు చెబితే చిరాగ్గా ముఖం పెట్టేవారు చాలామందే ఉన్నారు. బట్టలు సర్దుకోవడం నుండి ప్రయాణం, ఆహారం, షెల్టర్ వంటివి చూసుకోవడం పెద్ద టాస్క్ లాగే ఉంటుంది. కానీ మరొకవైపు ప్రయాణాలంటే చాలా ఇష్టపడేవారు కూడా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ప్రయాణమన్నా సరే చకచకా అన్ని సర్జేసుకుంటారు. ప్రయాణం ముగిసి ఇంటికి చేరేవరకు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోరు. దీని వెనుక కారణం ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉన్న వస్తువులు, దుస్తులు మొదలైనవాటిని తెలివిగా ఎంపిక చేసుకోవడమే.. సాధారణ బస్సు ప్రయాణం నుండి విదేశాలకు విమానంలో ప్రయాణించడం వరకు తరచుగా ప్రయాణాలు చేసేవారు అస్సలు మరచిపోని 10 వస్తువులేంటో తెలుసుకుని వాటిని వెంట ఉంచుకుంటే ప్రయాణాలలో ఎవ్వరూ అసౌకర్యం అనే సమస్యను ఎదుర్కోరు.
స్నీకర్స్(sneakers) ను షూస్ అని కూడా అంటారు. స్నీకర్స్ మెత్తగా, సౌకర్యవంతంగా ఉంటే కొత్తప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా తిరిగినా ఎలాంటి ఇబ్బంది అనిపించదు. కాళ్ల నొప్పులు లాంటి సమస్యలేవీ ఎదురుకావు.
ఉదయం, రాత్రితో వాతావరణం మారుతూ ఉంటుంది. ఏసీ బస్సులు, ఏసీ ట్రైన్ కోచ్ లు, విమానాలలో ప్రయాణించేటప్పుడు చలి సహజంగా అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో వెచ్చగా ఉండేందుకు స్వెట్ షర్ట్(sweatshirts) ధరించాలి. రాత్రి సమయాల్లో కూడా వాతావరణ మార్పుల వల్ల చలిగా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వెట్ షర్ట్ ఒకటి వెంట ఉంచుకోవాలి.
Snake Video: ముంగిసతో కొట్లాట.. ప్రాణభయంతో ఓ చిన్నారి నిద్రపోతున్న ఊయల పైకి ఎక్కిన పాము.. చివరకు..!
సూర్యూడి అతినీలలోహిత కిరణాల నుండి తమను తాము రక్షించుకోవడానికి సన్స్కీన్ లోషన్(sunscreen lotion) వెంట ఉంచుకుంటారు. దీర్ఘకాలం చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.
కొత్తప్రదేశాలు, కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు రోడ్డుమీద, క్లిష్టమైన దారుల్లో వెళుతున్నప్పుడు శరీర స్థితి మారుతూ ఉంటుంది. హార్ట్ రేట్, బిపి, వాతావరణ ఉష్ణోగ్రత మొదలైన వాటిని చెక్ చేసుకుంటూ ఉండటానికి ఫిట్ నెస్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్(fitness smartwatch) ఒకటి వెంట ఉంచుకోవాలి.
సన్ గ్లాసెస్(sunglasses) కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే ధరించరు. ఇవి తీవ్రమైన సూర్యకిరణాల నుండి కళ్లను రక్షిస్తాయి. స్పేర్ పెయిర్ స్మార్ట్ బ్యాకప్ సన్ గ్లాసెస్ ను వెంట ఉంచుకోవాలి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్నపాటి మెడిసిన్ కిట్(medicine kit) ఒకటి వెంట ఉండాలి. ఇందులో బ్యాండ్-ఎయిడ్, నొప్పి నివారణ మాత్రలు, స్ప్రే, రెగులర్ ప్రిస్కిప్షన్ మందులు ఖచ్చితంగా ఉండాలి.
వాతావరణం మార్పుతో పాటు కొత్తప్రదేశాలలో వింత అనుభవాలు ఎదురవుతాయి. దోమలు, పురుగులు వంటివి పడుకునే ప్లేస్ లో ఉంటే నిద్ర కరువవుతుంది. దోమల స్ప్రే(mosquito spray) ఒకటి వెంట ఉంచుకోవాలి.
ఎక్కడికి వెళ్లినా దాహం మాత్రం బాగా వేస్తుంది. తిరిగి ఉపయోగించుకోగల మంచినీటి బాటిల్(re usable water bottle) ఒకటి వెంట ఉంచుకుంటే ఎక్కడైనా నీరు లభ్యమైనపుడు అందులో నీరు పట్టుకుని దాహం తీర్చుకోవచ్చు.
అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటప్పుడు ఎలక్ట్రిక్ అవుట్ లెట్ ల దగ్గర ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా ఎలక్ట్రిక్ వస్తువులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛార్జింగ్ చేయడానికి యూనివర్సల్ అడాప్టర్(universal adapter) చక్కగా ఉపయోగపడుతుంది.
ప్రయాణాలలో చక్కని నిద్ర కావాలంటే ట్రావెల్ పిల్లో(travel pillow) తప్పక వెంట ఉండాలి. ఎక్కువ గంటలు ప్రయాణం చేసేటప్పుడు దిండు ఉంటే హాయిగా గమ్యం చేరేవరకు నిద్రపోవచ్చు. నిద్ర సరిగా ఉంటే పగటి సమయంలో హుషారుగా ఉండొచ్చు.