Treasure: ఊరి చివర చెరువులో పూడిక తీస్తోంటే బయటపడ్డ భోషాణం.. ఏముందా అని తెరచి చూస్తే లోపల షాకింగ్ సీన్.. చివరకు..!

ABN , First Publish Date - 2023-07-03T17:20:30+05:30 IST

నిధులు, వాటికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇవన్నీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఓ గ్రామానికి చెందిన చెరువులో భోషాణం బయటపడటంతో..

Treasure: ఊరి చివర చెరువులో పూడిక తీస్తోంటే బయటపడ్డ భోషాణం.. ఏముందా అని తెరచి చూస్తే లోపల షాకింగ్ సీన్.. చివరకు..!

నిధులు, వాటికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇవన్నీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు ఓ గ్రామంలో చెరువు పూడిక తీత పనులు చేపట్టారు. ఇందులో భాగంగా భోషాణం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అధికారులు గుర్తించలేదు. ఆ గ్రామ ప్రజలు దీన్ని గుర్తించి అందులో ఏముందా అని తెరచి చూసి షాక్యయారు. దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివిరాల్లోక్ వెళితే..

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం భిల్వారా జిల్లాలోని పరోలి పట్టణంలో ఓ చెరువు(pond) ఉంది. ఈ చెరువు పేరు అగరియా. చెరువులో చెత్తా చెదారం పేరుకుపోయి అధ్వాన్నంగా మారడంతో అధికారుల ప్రమేయంతో ఈ చెరువు పూడిక తీత పనులు(pond excavation works) కొన్ని రోజుల కిందట జరిగాయి. ఆ సమయంలో జేసీబీలతో పూడిక తీసినప్పుడు అందులో భాగంగా భోషాణం(treasure) బయటపడింది. కానీ ఈ విషయాన్ని అధికారులు, గ్రామస్తులు, అక్కడి పనివారు ఎవరూ గుర్తించలేదు. చెరువు పూడిక తీసినతరువాత దాన్ని అక్కడినుండి తొలగించకుండా చెరువు అంచుల్లో అలాగే వదిలేశారు. ఇన్నాళ్ళు వర్షాలేమీ లేకపోవడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ ఇటీవల కురుస్తున్న వర్షాలకు(recent rains) చెరువు అంచుల్లో ఉన్న చెత్త, ప్లాస్టిక్ కవర్లు అన్ని మళ్లీ చెరువులోకి వెళ్లడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో వెండి నాణెలు(silver coins) ఉన్నట్టు గ్రామస్తులకు తెలిసింది. దీంతో గ్రామస్తులు(villagers) చెరువు దగ్గరకు చేరుకున్నారు.

Yellow Teeth: ఎంత ప్రయత్నించినా పచ్చగా ఉన్న పళ్లు తెల్లగా మారడం లేదా..? ఇంట్లోనే తయారు చేసుకునే ఈ పేస్ట్‌ను వాడితే..!


చెరువు దగ్గరకు వెళ్ళిన గ్రామస్తులకు చెత్తలో వెండి నాణెలు మెరుస్తు కనిపించాయి. అవి చూడగానే గ్రామస్తుల కళ్ళు జిగేలుమన్నాయి. గ్రామస్తులంతా రాత్రికిరాత్రే ఆ వెండి నాణేలను పోటీ పడి ఎత్తుకెళ్ళారు(villagers picked up silver coins). ఈ విషయం మరుసటి రోజు అధికారులకు తెలియనే తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల నుండి నాణేలను తిరిగి సేకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చెరువులో బయటపడిన వెండినాణేలు రాజ్ షాహీ యుగానికి(Rajshahi zamindari) చెందినవని చెబుతున్నారు. ఈ నాణేలు 1916 సంవత్సరానికి చెందినవిగా తేలింది. నాణేల మీద ఆనాటి భ్రిటీష్ అధికారి జార్జ్ ఫ్రెడరిక్ అల్భర్ట్(British officer george frederick albert) ముఖచిత్రం ఉంది. ఈ వెండి నాణేలు 80శాతం స్వచ్చమైనవని తెలిసింది. ప్రస్తుతం కొందరు పోలీసులు గ్రామస్తులను ఆరా తీస్తుండగా మరికొందరు ఈ చెరువు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

Yellow Nails: చేతి గోళ్లు ఎప్పుడైనా ఇలా పచ్చగా మారిపోయాయా..? అయితే మీరు చేయాల్సిన పనేంటంటే..!


Updated Date - 2023-07-03T17:20:30+05:30 IST