ఏ సైజు టీవీని ఎంత దూరం నుంచి చూడాలి? ఈ లెక్కలు తెలుసుకుని టెలివిజన్ చూస్తే ఎంత లాభమంటే..

ABN , First Publish Date - 2023-04-02T11:02:24+05:30 IST

ఇంటిలోని టీవీకి తగినంత దూరంలో కూర్చుని చూడాలని నిపుణులు(Experts) సూచిస్తుంటారు. అయితే టీవీ పరిమాణం ప్రకారం, దానిని చూడటానికి తగినంత దూరంలో కూర్చోవడం కూడా అవసరమే.

ఏ సైజు టీవీని ఎంత దూరం నుంచి చూడాలి? ఈ లెక్కలు తెలుసుకుని టెలివిజన్ చూస్తే ఎంత లాభమంటే..

ఇంటిలోని టీవీకి తగినంత దూరంలో కూర్చుని చూడాలని నిపుణులు(Experts) సూచిస్తుంటారు. అయితే టీవీ పరిమాణం ప్రకారం, దానిని చూడటానికి తగినంత దూరంలో కూర్చోవడం కూడా అవసరమే. లేకుంటే అది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. మీ ఇంటిలోని టీవీ 24 అంగుళాలు(24 inches) ఉంటే, దానిని చూడటానికి మీకు- టీవీకి మధ్య కనీసం 3 అడుగుల దూరం ఉండాలి. టీవీ చూడటానికి గరిష్ట దూరం(Maximum distance) కూడా చాలా ముఖ్యం.

24 అంగుళాల టీవీని చూడటానికి గరిష్ట దూరం 5 అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు. మీ ఇంట్లో 32 అంగుళాల టీవీ ఉన్నట్లయితే, దానిని కనీసం 6 అడుగుల, గరిష్టంగా 7 అడుగుల దూరం నుండి చూడటం ఉత్తమం. నిజానికి మీరు టీవీని దగ్గరగా చూస్తే మీరు దాని పిక్సెల్‌(Pixel)లను చిన్న బాక్సుల రూపంలో చూడగలుగుతారు.

అప్పుడు మీకు స్పష్టమైన చిత్రం(clear picture) కనిపించదు. అంతేకాకుండా టీవీ నుంచి వెలువడే కిరణాల వల్ల తక్కువ దూరం ఉన్నప్పుడు కళ్లకు అధిక నష్టం(damage) వాటిల్లుతుంది. మీ ఇంట్లో 43-అంగుళాల టీవీ ఉంటే, మీరు కనీసం 6 అడుగుల దూరం నుండి, గరిష్టంగా 8 అడుగుల దూరం నుండి చూడాలి. మీ ఇంట్లో 50 నుండి 55 అంగుళాల స్క్రీన్(55 inch screen) సైజు టీవీ ఉంటే, మీరు దానిని 10 అడుగుల కంటే దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు.

Updated Date - 2023-04-02T12:06:20+05:30 IST