Cab Driver: క్యాబ్‌లో సీటుకు రాసి ఉందో కండీషన్.. అది చదివి కామెంట్ చేసిన ఓ కుర్రాడికి దిమ్మతిరిగే షాకిచ్చిన డ్రైవర్..!
ABN , First Publish Date - 2023-05-20T15:54:35+05:30 IST
మెట్రో నగరాల్లో ప్రయాణించే వారు చాలా సందర్భాల్లో క్యాబ్‌లనే ఆశ్రయిస్తారు. ఉబర్, ఓలా వంటి సంస్థలు దేశంలోని పలు మెట్రో నగరాల్లో క్యాబ్ సర్వీస్‌లను అందిస్తున్నాయి. అయితే ఒక్కోసారి క్యాబ్ డ్రైవర్లు చేసే వింత విజ్ఞప్తులు షాకిస్తుంటాయి.
మెట్రో నగరాల్లో ప్రయాణించే వారు చాలా సందర్భాల్లో క్యాబ్‌లనే (Cabs) ఆశ్రయిస్తారు. ఉబర్, ఓలా వంటి సంస్థలు దేశంలోని పలు మెట్రో నగరాల్లో క్యాబ్ సర్వీస్‌లను అందిస్తున్నాయి. అయితే ఒక్కోసారి క్యాబ్ డ్రైవర్లు చేసే వింత విజ్ఞప్తులు షాకిస్తుంటాయి. అలాంటివి సోషల్ మీడియాలో వైరల్ అయి షాకిస్తుంటాయి. తాజాగా ఢిల్లీలోని ఓ క్యాబ్ డ్రైవర్ (Uber Cab Driver) తన క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి షాకిచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
@thatguywithbeard అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఢిల్లీలోని ఆ వ్యక్తి ఎక్కిన క్యాబ్ సీటుకు ``కారులో రొమాన్స్ చేయకూడదు`` (No romance allowed in this) అని రాసి ఉన్న నోటీస్ తగిలించి ఉంది. దానిని చదివిన ప్రయాణికుడు.. ``చాలా మంచిది. నేను నా గాళ్‌ఫ్రెండ్‌తో ఎప్పుడు క్యాబ్ ఎక్కను`` అని అన్నాడు. దానికి వెంటనే క్యాబ్ డ్రైవర్ స్పందిస్తూ.. ``సర్.. మీకు కూడా గాళ్‌ఫ్రెండ్ ఉందా?``అని ప్రశ్నించాడు. ఆ డ్రైవర్ అడిగిన ప్రశ్నకు ఆ పాసింజర్ షాకయ్యాడు. చాలా అవమానంగా ఫీలయ్యాడు.
Viral Video: ఓ విమాన ప్రయాణీకుడికి ఊహించని అనుభవం.. కిటికీ పక్కన కూర్చుని అవతలి వైపు చూస్తే కళ్లు చెదిరే దృశ్యం..!
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.9 లక్షల మంది లైక్ చేశాడు. ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ``ఎమోషనల్ డ్యామేజ్ చేశాడు``, ``సెకెన్లలో నాశనం చేశాడు`` అంటూ లాఫింగ్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు.