Viral: భలే బైక్..దీని టైర్‌లోపల కూర్చుంటే కానీ బండి నడపలేం! ఈ వైరల్ వీడియో చూస్తే..
ABN , First Publish Date - 2023-10-12T17:32:39+05:30 IST
ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలోని వింత బైక్ జనాల్ని కంగారు పెడుతోంది. బైక్ మొత్తాన్ని కప్పేసేలా వెనక టైరు ఉంటే.. దానిలోపల కూర్చుని బండి నడిపేవిధంగా దీన్ని తయారు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడెక్కడి విశేషాలూ క్షణాల్లో ప్రపంచమంతటికీ చేరిపోతున్నాయి. వీటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది. వీడియోలోని వింత బైక్ జనాల్ని కంగారు పెడుతోంది. బైక్ మొత్తాన్ని కప్పేసేలా వెనక టైరు ఉంటే.. దానిలోపల కూర్చుని బండి నడిపేవిధంగా దీన్ని తయారు చేశారు(Unicycle like bike with big back tyre). ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
NRI: వామ్మో..ఎన్నారై బాలిక! 15 ఏళ్లకే సొంత సంస్థ ఏర్పాటు..ఇప్పుడామె రేంజ్ తెలిస్తే..
వీడియో సూరత్‌లో తీసిందని జనాలు చెబుతున్నారు కానీ ఎప్పుడు రికార్డు చేశారన్న క్లారిటీ మాత్రం లేదు. ఒక టైరు మాత్రమే ఉండే సైకిల్ స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. బైక్‌కు రెండు చక్రాలు ఉన్నప్పటికీ వెనక చక్రం చాలా భారీగా మనిషంత ఎత్తు ఉంటుంది. ఇది బైక్ చుట్టూ తిరుగుతుంటుంది. టైర్ లోపల యాథావిధిగా సీటు గట్రా ఏర్పాటు చేశారు. మలుపులు తిరిగేందుకు వీలుగా ముందు ఓ చిన్నపాటి చక్రాన్ని ఏర్పాటు చేశారు.
ఓ పెద్దాయన ఈ వింత వాహనాన్ని రోడ్డు మీద నడుపుతుండగా అటుగా వెళుతున్న ఓ వ్యక్తి రికార్డు చేశాడు. అంతేకాదు.. బైక్‌కు సంబంధించి ఏవో ప్రశ్నలు కూడా అడిగాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు అమితాశ్చర్యానికి లోనవుతున్నారు. ఇలాంటి బైక్ రూపొందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందోనని కొందరు సందేహం వెలిబుచ్చారు. అసలు ఇలాంటి బైకులు రోడ్ల మీదకు తీసుకురావచ్చా? దీనికి రిజిస్ట్రేషన్ వంటివి చేస్తారా? అని ప్రశ్నించారు. ఇలా జనాలు రకరాల సందేహాలు వెలిబుచ్చుతూ వీడియోను షేర్ చేయడం, లైకులు ఇవ్వడం చేస్తుండటంతో వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నడుస్తోంది.