Short Marriage: వరుడు కావాలంటూ పేపర్లో యాడ్.. షార్ట్ మ్యారేజ్ అంటూ వింత కండీషన్‌తో అంతా షాక్..!
ABN , First Publish Date - 2023-08-25T16:00:23+05:30 IST
అప్పుడప్పుడు పత్రికల్లో వచ్చే పెళ్లి ప్రకటనల యాడ్‌లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ ప్రకటన ఇచ్చిన వారి షరతులు నమ్మశక్యం కానివిగా, నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. తాజాగా అలాంటిదే ఓ మ్యాట్రిమోనియల్ యాడ్ ఓ పేపర్‌లో వచ్చింది. ఆ యాడ్ అర్థమేంటో తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు.
అప్పుడప్పుడు పత్రికల్లో వచ్చే పెళ్లి ప్రకటనల యాడ్‌లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ ప్రకటన ఇచ్చిన వారి షరతులు నమ్మశక్యం కానివిగా, నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. తాజాగా అలాంటిదే ఓ మ్యాట్రిమోనియల్ యాడ్ (Unusual matrimonial ad) ఓ పేపర్‌లో వచ్చింది. ఆ యాడ్ అర్థమేంటో తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. దీంతో నెటిజన్లు దాని అర్థం ఏంటో చెబుతూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. జర్నలిస్ట్ Tanishka Sodhi ఈ ట్వీట్ చేశారు. ఆ ప్రకటనలోని ``షార్ట్ మ్యారేజ్`` (Short Marriage) అని ఉండడం చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తోంది.
``షార్ట్ మ్యారేజ్ కోసం ముంబై (Mumbai) సంపన్న కుటుంబం నుంచి వరుడు కావాలి. విడాకులు తీసుకున్న బ్రాహ్మణ అమ్మాయికి వరుడు (Groom) కావాలి. 1989లో జన్మించిన తెలివైన, చదువుకున్న, 5'7″ హైట్ ఉన్న అమ్మాయి ముంబైలో వ్యాపారాన్ని నడుపుతోంది`` అని ప్రకటనలో ఉంది. ఈ ప్రకటనలో ``షార్ట్ మ్యారేజ్`` అంటే ఎంటో ఎవరికీ అర్థం కావడం లేదు. నెటిజన్లు ``షార్ట్ మ్యారేజ్``కు వివిధ రకాలు అర్థాలు చెబుతూ కామెంట్లు చేశారు. ఈ యాడ్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
Viral Video: మనసును కట్టిపడేస్తున్న వీడియో.. ఓ కూతురు ఉద్యోగానికి వెళ్లేందుకు రెడీ అవుతోంటే ఆ తండ్రి ఏం చేశాడో చూస్తే..!
````షార్ట్ మ్యారేజ్`` అంటే కేవలం నాలుగు నిమిషాల్లో వివాహ తంతు పూర్తి చేయాలనేమో``, ``కొద్ది రోజులు మాత్రమే ఆ అమ్మాయితో కాపురం చేసే యువకుడు కావాలేమో``, ``షార్ట్ మ్యారేజ్ అనే పదం అమ్మాయి 5`7`` హైట్‌ను సూచించినదేమో``, ``అమేజాన్‌లో వస్తున్న మేడిన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ నుంచి స్ఫూర్తి పొంది ఉంటారు`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఒక వ్యక్తి మాత్రం ``అది పద దోషం అయి ఉంటుంది. చాలా సింపుల్‌గా పెళ్లి ఉంటుందనే ఉద్దేశం కావొచ్చు`` అని కామెంట్ చేశారు.