ఆ సీఎం ప్రతీ 21 రోజులకు కాశీని సందర్శిస్తుంటారు.. 100 దర్శనాలు పూర్తి చేసుకున్న ఆయన కాలభైరవ ఆలయంలో ఏం చేస్తారంటే...
ABN , First Publish Date - 2023-04-23T07:22:57+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రి(Chief Minister) పదవిని అధిష్టించిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన యోగి ఆదిత్యనాథ్.. మహాదేవుని నగరమైన వారణాసి(Varanasi)లో అత్యధికంగా పర్యటించిన ముఖ్యమంత్రిగా కూడా నిలిచారు.
ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రి(Chief Minister) పదవిని అధిష్టించిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన యోగి ఆదిత్యనాథ్.. మహాదేవుని నగరమైన వారణాసి(Varanasi)లో అత్యధికంగా పర్యటించిన ముఖ్యమంత్రిగా కూడా నిలిచారు. తాజాగా విశ్వనాథుని ఆలయాన్ని వందోసారి సందర్శించిన మొదటి ముఖ్యమంత్రిగా పేరొందారు.
యోగి ఎప్పుడు కాశీకి వెళ్లినా బాబా విశ్వనాథుని ఆస్థానానికి తప్పకుండా హాజరవుతారు. యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) అర్చకులతో పాటు ఆలయంలో షోడశోపచార పద్ధతిలో పూజలు చేస్తారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాగానే తొలుత వారణాసిని సందర్శించారు. వారణాసి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పార్లమెంటరీ నియోజకవర్గం. ఇక్కడ ప్రధానమంత్రి పర్యటనలు తరచూ జరుగుతుంటాయి.
ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నెలకు ఒకసారి లేదా రెండుసార్లు కాశీని సందర్శిస్తారు. యోగి కాశీకి వచ్చిన ప్రతిసారీ అభివృద్ధి పనులను(Development works) సమీక్షిస్తూ, వాటిని పరిశీలిస్తుంటారు. అలాగే మహాదేవుని దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు.
సగటున ప్రతి 21 రోజులకోసారి సీఎం యోగి కాశీ విశ్వనాథ ఆలయానికి వస్తుంటారు. ఇది సనాతన సంస్కృతిపై(orthodox culture) ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమను తెలియజేస్తోందని విశ్వనాథుని ఆలయ అర్చకులు డాక్టర్ నీరజ్ కుమార్ పాండే(Dr. Neeraj Kumar Pandey) అన్నారు. సీఎం యోగి కాశీలోని కాలభైరవ ఆలయానికి వెళ్లినప్పుడల్లా సంప్రదాయం ప్రకారం హారతి ఇస్తుంటారు.