Viral News: సినిమాకు వస్తావా..? అంటూ ప్రేయసి ఫోన్.. టికెట్లు ఆమే బుక్ చేయడంతో ప్రియుడికి ఫుల్లు హ్యాపీ.. ఇంటర్వెల్ తర్వాత షాకింగ్ ట్విస్ట్..!
ABN , First Publish Date - 2023-04-21T13:58:20+05:30 IST
ఆ యువకుడికి కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ (Face Book) ద్వారా ఓ యువతి పరిచయమైంది.. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.. తరచుగా ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారు.. బుధవారం ఉదయం అమె అతడికి ఫోన్ చేసి ``సినిమాకు వస్తావా`` అని అడిగింది.
ఆ యువకుడికి కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ (Face Book) ద్వారా ఓ యువతి పరిచయమైంది.. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.. తరచుగా ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారు.. బుధవారం ఉదయం అమె అతడికి ఫోన్ చేసి ``సినిమాకు వస్తావా`` అని అడిగింది. అంతేకాదు.. టికెట్లు కూడా తానే బుక్ చేస్తానని చెప్పింది. దీంతో ఆ యువకుడు తన అదృష్టానికి పొంగిపోయి ఆమె రమ్మన్న థియేటర్‌కు (Movie Theatre) వెళ్లాడు. అప్పటికే ఆ యువతి కూల్‌డ్రింక్ (Cool Drink), పాప్‌కార్న్‌తో సిద్ధంగా ఉంది.
సినిమా థియేటర్లో ఆమె పక్కన కూర్చుని కూల్‌డ్రింక్ తాగుతూ కాసేపు సినిమా చూశాడు. అనంతరం నిద్రలోకి జారుకున్నాడు. సినిమా అయిపోయిన తర్వాత థియేటర్ సిబ్బంది లేపితే నిద్రలేచాడు. లేచి చూసుకుంటే జేబులోని పర్సు, ఉంగరాలు, మొబైల్ ఫోన్, పక్కన ఉండాల్సిన యువతి కనిపించలేదు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆ యువతి తనను మోసం చేసినట్టు తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే అలాంటి కేసులు ఆరు రావడంతో అప్రమత్తమైన పోలీసులు థియేటర్లోని సీసీటీవీ ద్వారా ఆమెను గుర్తించి, ఆమెతో పాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు (Crime News).
Crime News: దెయ్యమై కలలోకి వచ్చి వేధిస్తున్నాడట.. 20 ఏళ్ల క్రితం పాతి పెట్టిన శవం కోసం అడవిలో తవ్వకాలు..!
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోకు చెందిన 25 ఏళ్ల యువతి అంకిత, ఆమె భర్త అమిత్ కుమార్ కొన్నాళ్లుగా ఇలా హనీట్రాప్‌నకు (Honey Trap) పాల్పడి అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. గతంలో కూడా ఐదుగురు యువకులను ఇలాగే మోసం చేశారు. బాగా డబ్బున్న యువకులను గుర్తించి ఫేస్బుక్ ద్వారా వారికి వల వేసి ట్రాప్ చేస్తారు. అనంతరం వారిని సినిమా థియేటర్లకు పిలిచి ఇద్దరూ కలిసి దోచుకుంటారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.