Youtuber: బాబోయ్.. ఇంత డబ్బా..? ఈ యూట్యూబర్ ఇంట్లో సోదాలు చేసేందుకు ఐటీ అధికారులు వెళ్తే ఏం దొరికాయంటే..!
ABN , First Publish Date - 2023-07-17T17:35:51+05:30 IST
ప్రతిరోజూ షేర్ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలను రూపొందిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్ తస్లీమ్. అతడు వివిధ అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిరోజూ షేర్ మార్కెట్ (Share Market)కు సంబంధించిన వీడియోలను రూపొందిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన యూట్యూబర్ (Youtuber) తస్లీమ్ (Taslim). అతడు వివిధ అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అతడి ఇంటిపై ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహించారు (IT Raids on Youtuber Taslim). ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన తస్లీమ్ ఇంట్లో రూ.24 లక్షల నగదు దొరికినట్టు అధికారులు వెల్లడించారు.
ఐటీ అధికారుల దాడులు, ఆరోపణలపై తస్లీమ్ సోదరుడు స్పందించాడు. తమ సోదరుడిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. తస్లీమ్ ఎలాంటి తప్పులూ చేయలేదని అన్నాడు. యూట్యూబ్ ఛానల్ ``ట్రేడింగ్ హబ్ 3.0`` (Trading Hub 3.0) ద్వారా తన సోదరుడు తస్లీమ్ షేర్ మార్కెట్ సంబంధిత వీడియోలు పోస్ట్ చేస్తుంటాడని, ఆ వీడియోల ద్వారా వచ్చే సంపాదనపై ట్యాక్స్ కూడా సక్రమంగా కడుతున్నాడని చెప్పారు. యూట్యూబ్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన రూ. 1.2 కోట్ల ఆదాయానికి ఇప్పటికే రూ. 4 లక్షల పన్ను కట్టామని తెలిపాడు.
Viral Video: పాపం.. ఈ అమ్మాయి.. కోతే కదా భయపడిపోతుందిలే అనుకుంటే.. ఇలా షాకిస్తుందని అస్సలు ఊహంచలేదు..!
తాము అక్రమంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, కుట్ర ప్రకారమే ఐటీ దాడులు జరిగినట్టు అనిపిస్తోందని చెప్పాడు. తస్లీమ్ తల్లి కూడా ఐటీ దాడులపై స్పందించారు. తమ కుమారిడిని కావాలనే కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.