యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కల్పించే నట్స్ ఇవే..

ABN , First Publish Date - 2023-01-19T11:58:40+05:30 IST

యూరిక్ యాసిడ్ సమస్యతో సతమతమయ్యేవారు శీతాకాలంలో ప్రోటీన్ కలిగిన ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రొటీన్ ఫుడ్ ప్యూరిన్‌ను విడుదల చేస్తుంది.

యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కల్పించే నట్స్ ఇవే..

యూరిక్ యాసిడ్ సమస్యతో సతమతమయ్యేవారు శీతాకాలంలో ప్రోటీన్ కలిగిన ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రొటీన్ ఫుడ్ ప్యూరిన్‌ను విడుదల చేస్తుంది. ఈ ప్యూరిన్ శరీరం నుండి బయటకు వెలువడలేనప్పుడు అది ఎముకలు, కీళ్లలో చిక్కుకుపోతుంది.

దీని కారణంగా గౌట్ సమస్య తలెత్తుతుంది. కాగా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నవారు బాదం తినవచ్చా? లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు బాదంపప్పును తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన దీనిని స్పష్టం చేస్తోంది. ఇది సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటును సమతుల్యం చేస్తుంది. శరీరపు జీవక్రియ రేటు ప్రభావితం కాకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ ప్యూరిన్‌ను సరిగ్గా జీర్ణం చేయగలుగుతుంది.

పొట్టు తీయని బాదం అందించే ప్రయోజనాలివే..

ప్రతిరోజు అల్పాహారానికి ముందు 10 గ్రాముల బాదంపప్పు తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని న్యూట్రిషన్ జర్నల్‌లో వెల్లడించారు. ఇందుకోసం బాదంపప్పును తొక్కతో పాటు తినాలి. బాదం తొక్కలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇది కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధిస్తుంది. బాదంపప్పును రాత్రి నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తొక్కతో పాటు తినడం ఎంతో మేలు చేకూరుస్తుంది. బాదాములలో విటమిన్ ఈ, మెగ్నీషియం, మాంగనీస్‌ పుష్కలంగా ఉంటాయి. బాదం తొక్కలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. మొత్తంగా చూస్తే యూరిక్ యాసిడ్ సమస్యకు బాదాములు నివారణగా సహకరిస్తాయి.

Updated Date - 2023-01-19T11:58:41+05:30 IST