UrvashiRautela: 'కాంతారా-2' లో ఈ బాలీవుడ్ భామ

ABN , First Publish Date - 2023-02-11T15:45:33+05:30 IST

జనవరి లో సంక్రాంతి పండగ నాడు విడుదల అయిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) లో చిరంజీవితో (MegaStar Chiranjeevi) 'బాస్ పార్టీ' (Boss Party Song) సాంగ్ లో డాన్స్ చేసిన ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది

UrvashiRautela: 'కాంతారా-2' లో ఈ బాలీవుడ్ భామ
File photo of Urvashi Rautela and Chiranjeevi at a Waltair Veerayya film promotional event

జనవరి లో సంక్రాంతి పండగ నాడు విడుదల అయిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) లో చిరంజీవితో (MegaStar Chiranjeevi) 'బాస్ పార్టీ' (Boss Party Song) సాంగ్ లో డాన్స్ చేసిన ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. హిందీ సినిమాలతో పాపులర్ అయినా ఈ నటి, ఇప్పుడు దక్షిణాది సినిమాల మీద కన్నేసింది అని తెలుస్తోంది. ఊర్వశి తన సాంఘీక మాధ్యమం లో 'కాంతారా' (#Kantara) దర్శకుడు, నటుడు అయిన రిషబ్ శెట్టి (Rishabh Shetty) తో ఒక ఫోటో షేర్ చేసింది. అయితే ఈమె 'కాంతారా -2' (Kantara-2) లో కథానాయకురాలి గా రిషబ్ శెట్టి పక్కన వేస్తోంది అని తెలుస్తోంది ఈ ఫోటో తో.

Urvashi-rautela.jpg

'కాంతారా 2' ఆమధ్య విడుదల అయినా 'కాంతారా' కి సీక్వెల్ కాదుట, ప్రీక్వల్ అని చెప్పారు కాదా. అందుకని ఆ సినిమాలో ఎవరిని అయినాయి తీసుకోవచ్చు. 'కాంతారా' లో వున్న నటులే అవసరం లేదు, అందుకని ఊర్వశి రౌతేలాని కథానాయకురాలుగా రిషబ్ శెట్టి తీసుకున్నాడని, అందుకనే ఆమెని కలవడానికి ముంబై వెళ్లి కథ చెప్పాడని కూడా తెల్సింది. అప్పుడే ఆమె రిషబ్ శెట్టి తో ఒక ఫోటో షేర్ చేసిందని కూడా చెప్తున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పుడు టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ కి బాగా పాపులర్ అయిన నటిగా ప్రాచుర్యం పొందింది. చిరంజీవి తో చేసిన తరువాత, ఇప్పుడు రామ్ పోతినేని (Ram Pothineni) తో అతని రాబోయే సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-11T15:45:35+05:30 IST