Share News

Viral News: రూ.628 బిల్లు.. పొరపాటున రూ.6 లక్షలను చెల్లించిన యువతి.. వారం రోజుల తర్వాత గుర్తించినా..!

ABN , First Publish Date - 2023-11-25T14:37:44+05:30 IST

అమెరికాకు చెందిన ఓ మహిల గత నెలలో సబ్ వే రెస్టారెంట్‌కు వెళ్లి ఓ శాండ్ విచ్ ఆర్డర్ చేసింది.. ఆ శాండ్ విచ్‌కు ఆమె చెల్లించాల్సిన బిల్లు రూ.7.54 డాలర్లు (రూ.628). అయితే ఆమె పొరపాటున 7,105.44 డాలర్లు (రూ.5,91,951) చెల్లించింది. ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపు చేసింది.

Viral News: రూ.628 బిల్లు.. పొరపాటున రూ.6 లక్షలను చెల్లించిన యువతి.. వారం రోజుల తర్వాత గుర్తించినా..!

అమెరికాకు (America) చెందిన ఓ మహిళ గత నెలలో సబ్ వే (Subway) రెస్టారెంట్‌కు వెళ్లి ఓ శాండ్ విచ్ (Sandwich) ఆర్డర్ చేసింది.. ఆ శాండ్ విచ్‌కు ఆమె చెల్లించాల్సిన బిల్లు రూ.7.54 డాలర్లు (రూ.628). అయితే ఆమె పొరపాటున 7,105.44 డాలర్లు (రూ.5,91,951) చెల్లించింది. ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికా (Bank Of America) క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపు చేసింది. నెలఖారులో వచ్చిన క్రెడిట్ కార్డు బిల్లు (Credit Card Bill) చూసి ఆమె షాకైంది. తను పొరపాటును చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందడానికి ఆమె పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఈ ఘటన వైరల్‌ (Viral)గా మారింది.

అమెరికాకు చెందిన వెరా కానర్ అనే మహిళ అక్టోబర్ 23వ తేదీన సబ్ వే రెస్టారెంట్‌కు వెళ్లింది. ఓ శాండ్‌విచ్ తిన్న తర్వాత బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్లింది. రూ.7.54 డాలర్లు చెల్లించాలనుకుంది. అయితే రెస్టారెంట్ రివార్డు పాయింట్ల కోసం తన మొబైల్ నెంబర్లోని చివరి ఆరు నెంబర్లను ఎంటర్ చేసింది. అయితే ఆ మొబైల్ నెంబర్ కూడా అనుకోకుండా బిల్లు అమౌంట్‌లో కలిసిపోయి మొత్తం 7,105.44 డాలర్లు చెల్లించింది. అనంతరం ఇంటికి వెళ్లిపోయింది. నెలఖారులో వచ్చిన క్రెడిట్ కార్డు బిల్లు చూసి వార్నర్ షాకైంది. సబ్ వేలో తాను రూ.5.91 లక్షలు టిప్ ఇచ్చినట్టు తెలుసుకుని నివ్వెరపోయింది.

Viral Video: మొసలి భయపడుతోంది కదా అని రెచ్చిపోయాడు.. మరుక్షణంలోనే దిమ్మతిరిగే షాకిచ్చింది..!

వెంటనే ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికాతో తన సమస్య చెప్పి రిఫండ్ అడిగింది. అందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా తిరస్కరించింది. తర్వాత ఆమె సబ్‌వేని సందర్శించి మేనేజర్‌కు తమ సమస్యను వివరించింది. చివరకు నెల రోజుల తర్వాత అమౌంట్‌ను రిఫండ్ చేయడానికి సబ్ వే అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. సబ్ వేకు రూ.7 వేల డాలర్లు చెల్లించాల్సిన అవసరం గురించి బ్యాంక్ ఆఫ్ అమెరికాకు డౌట్ రాకపోవడం విచిత్రంగా ఉందని బ్యాంక్‌పై కానర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-11-25T14:37:49+05:30 IST