నూనె బాటిల్ మూత కింద నుండే ట్యాబ్ తీసి పారేస్తున్నారా?.. దాని వినియోగం ఏమిటో తెలిస్తే... జన్మలో ఇక ఆ పని చేయరు!

ABN , First Publish Date - 2023-05-01T08:28:16+05:30 IST

సాధారణంగా వంట నూనె(cooking oil)ను వాడని ఇల్లంటూ ఉండదు. అయితే వంట నూనె బాటిల్ విషయంలో చాలామంది ఒక తప్పు చేస్తుంటారు.

నూనె బాటిల్ మూత కింద నుండే ట్యాబ్ తీసి పారేస్తున్నారా?.. దాని వినియోగం ఏమిటో తెలిస్తే... జన్మలో ఇక ఆ పని చేయరు!

సాధారణంగా వంట నూనె(cooking oil)ను వాడని ఇల్లంటూ ఉండదు. అయితే వంట నూనె బాటిల్ విషయంలో చాలామంది ఒక తప్పు చేస్తుంటారు. బాటిల్‌కు సంబంధించిన ఒక విషయం తెలియకపోవడంతోనే ఇలా జరుగుతుంటుంది. చాలామంది వంటనూనె బాటిల్‌ మూత కింద ఉన్న ప్లాస్టిక్ ట్యాబ్‌(Plastic tabPlastic tab)ని తీసి, చెత్తలో పారేస్తుంటారు. ఎందుకంటే దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియకనే అలా చేస్తుంటారు.

చాలా మంది బాటిల్‌ను పూర్తిగా తెరిచి ఉంచడానికే ఈ ట్యాబ్‌ని తీసివేస్తారు. అయితే అలా చేయడం తప్పు అని ఆయిల్ బాటిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఆ ట్యాబ్ ఎంతో ఉపయోగకరమని ఆ కంపెనీలు అంటున్నాయి. వంటనూనె బాటిల్ మూత దిగువన ఉండే ప్లాస్టిక్ ట్యాబ్ నూనె ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. ఫలితంగా పాత్రలో అధికంగా నూనె పడదు. తగినంత మేరకే నూనె(oil)ను వినియోగించవచ్చు. అయితే దీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మీ వేలితో ట్యాబ్ బయటకు తీశాక.. దానిని బాటిల్ ఓపెన్ ఉన్న చోట తలకిందులుగా బిగించాలి. బాటిల్ ఓపెన్ ప్రాంతంలోని ప్లాస్టిక్ పళ్ళు(Plastic teeth) ఆ ట్యాబ్‌ను ట్రాప్ చేస్తాయి, ఆ తర్వాత పాత్రలో నూనె పోసినప్పుడు, నూనె నెమ్మదిగా బయటకు వస్తుంది. అధిక పరిమాణంలో బయటకు వచ్చే అవకాశం ఉండదు.

Updated Date - 2023-05-01T09:12:59+05:30 IST