Valentines Day: గులాబీల కోసం ఎగబడిన కుర్రాళ్లు.. ఒక్క ఢిల్లీలోనే గులాబీ పువ్వుల అమ్మకం ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయంటే..
ABN , First Publish Date - 2023-02-15T19:25:45+05:30 IST
పువ్వుల బిజినెజ్ ఏ గుడి దగ్గరో.. లేక పుణ్యక్షేత్రాల దగ్గరో జోరుగా సాగుతుంది. మరీ పెళ్ళిళ్ళ సమయంలో కాస్త మెరుస్తుంది. కానీ వాలెంటైన్స్ డే (Valentines Day) రోజు మాత్రం దేశంలో పువ్వుల అమ్మకాలు
గులాబీకి ప్రేమకు ఉన్న బాండింగ్ ఎలాంటిదంటే అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉన్నంత అట్రాక్షన్ ఉంటుంది ఆ రెండింటికి. ప్రేమకు నిర్వచనంగా గులాబీని చెబితే.. అందులో ఎరుపురంగు అన్నిటికంటే ముందువరుసలో ఉంటుంది. మామూలు సమయంలో పువ్వుల బిజినెజ్ ఏ గుడి దగ్గరో.. లేక పుణ్యక్షేత్రాల దగ్గరో జోరుగా సాగుతుంది. మరీ పెళ్ళిళ్ళ సమయంలో కాస్త మెరుస్తుంది. కానీ వాలెంటైన్స్ డే (Valentines Day) రోజు మాత్రం దేశంలో పువ్వుల అమ్మకాలు పీక్స్ లోకి వెళ్ళిపోయాయి. తాము ప్రేమిస్తున్న అమ్మాయిలకు గులాబీలు ఇవ్వడానికి కుర్రాళ్ళు ఎగబడికొన్నారు. వాలెంటైన్స్ డే రోజు ఈ పువ్వులు చేసిన మ్యాజిక్ ఏంటో తెలుసా..
10రూపాయల గులాబీ ఏకంగా 50 రూపాయల నోటు ఎక్కింది ఈ వాలెంటైన్స్ డే రోజు. పువ్వుల మార్కెట్ ఊహించని విధంగా సాగింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఏకంగా 14కోట్ల రూపాయల పువ్వుల మార్కెట్ జరిగిందంటే అక్కడ వ్యాపారం ఎంత జోరుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 20పువ్వులున్న గులాబీ గుచ్చం 1000రూపాయలు పలికింది. సింగల్ గులాబీ అయితే తన రాజసం అంతా వాలెంటైన్స్ డే రోజు బయటపెట్టింది. వాలెంటైన్స్ డే రోజు కూరగాయలు, కరివేపాకు దొరక్కపోయినా గులాబీలు మాత్రం జోరుగా చక్కర్లు కొట్టేశాయి. ఇక ఢిల్లీ తరువాత బెంగుళూరు (Banglore), కలకత్తా (Calcutta), ముంబై (Mumbai) వంటి నగరాల్లో కూడా గులాబీల హవా కొనసాగింది. ఈ పువ్వులు ఎక్కువగా పూణే (Pune), కూర్గ్(Coorg), ఊటీ (Ooty), హోసూర్ (Hosur), బెంగుళూరు (Banglore) వంటి ప్రాంతాల నుండి సరఫరా అయ్యాయి. వాలెంటైన్స్ డే రోజు దేశం మొత్తం మీద 500కోట్ల పువ్వుల బిజినెస్ (500crores flower business) జరిగినట్టు వ్యాపార వర్గాల సమాచారం. ఏది ఏమైనా ఈ ప్రేమికుల రోజు వ్యాపారానికి బాగా పనికొచ్చింది.