వానరం.. మమకారం

ABN , First Publish Date - 2023-04-09T08:17:21+05:30 IST

రోడ్డుపై బండి పెట్టుకుని పండ్లు విక్రయించే ఓ వృద్ధుడు ఓ వానరానికి ప్రతి రోజూ అరటి పండో, ఆపిల్‌ పండో ఇచ్చేవాడు.

వానరం.. మమకారం

- మృతదేహం వద్ద మూగరోదన

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): రోడ్డుపై బండి పెట్టుకుని పండ్లు విక్రయించే ఓ వృద్ధుడు ఓ వానరానికి ప్రతి రోజూ అరటి పండో, ఆపిల్‌ పండో ఇచ్చేవాడు. అలా ఆ వానరానికి, వృద్ధుడికి స్నేహం ఏర్పడింది. ఉన్నట్టుండి వృద్ధుడు మృతి చెందాడు. ఆ పండ్లు ఆమ్మే స్థలంలో అతడు కనిపించకపోవడంతో ఆందోళనతో సమీపంలో పరిశీలించింది. ఇంటి వద్ద విగత జీవుడై కనిపించాడు. జనమంతా గూమికూడి ఏడుస్తున్నారు. తెల్లటి దుప్పటి కప్పి మృతదేహంపై పూలు వేశారు. వారెవ్వరినీ పట్టించుకోకుండా నేరుగా ఆ వానరం మృతదేహం వద్దకు వెళ్లింది. చుట్టూ తిరిగింది. మృతదేహాన్ని ముద్దాడింది. మూగరోదనతో కాసేపు అలానే కూర్చుండిపోయిం ది. అందరి మధ్యలో కొద్ది సేపు గడిపింది. విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్‌లో హనుమంతు అనే వ్యక్తి పండ్ల వ్యాపారి. ఒక బండి పెట్టుకుని చెట్టుకిం ద పండ్లు అమ్ముకునేవాడు. అక్కడికి రోజు ఆ వానరం వచ్చేది. ఆయన దానికి పండ్లు ఇచ్చేవాడు. చివరకు ఆయన ఆనారోగ్యంతో శుక్రవారం మరణించాడు. మృతదే హం వద్ద వానరం చూపిన మమకారం కడచూపునకు వచ్చిన వారందరి హృదయాలను కదలించివేసింది.

Updated Date - 2023-04-09T08:17:21+05:30 IST