Viral Video: బాబోయ్.. ఇదేం వింత జీవి..? ఒళ్లంతా జుట్టు.. తల మాత్రమే వెరైటీగా కనిపిస్తూ.. పాములాగా పాకుతూ..!
ABN , First Publish Date - 2023-10-07T18:03:06+05:30 IST
ఒళ్లంతా గడ్డితో కప్పిఉన్న పాములా కనిపిస్తున్న వింత జీవి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ జీవి ఏంటో అర్థంకాక జనాలు షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతిలో మనిషికి తెలీని మిస్టరీలు ఎన్నో! మనుపుటితో పోలిస్తే సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన మానవ సమాజానికి అర్థంకాని వింతలు, విశేషాలు ఇంకా లెక్కలేనన్ని మిగిలి ఉన్నాయి. అంతేకాకుండా, ఇలాంటి వింతలూ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను షేక్ చేస్తుంటాయి. అలాంటి వీడియో(Viral video) గురించి ప్రస్తుతం నెటిజన్లు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. వీడియోలోని వింత పామును(Grass like snake) చూసి భయపడిపోతున్నారు.
America: అమెరికాలోని ప్రవాసులకు బిగ్ షాక్.. న్యూయార్క్‌లో పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..?
పాములను చూస్తే ఎవరికైనా భయమే కానీ ఈ వింత పాము తీరు మాత్రం చాలా డిఫరెంట్. అసలు ఇది పాము కాదో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. థాయ్‌ల్యాండ్‌లో(Thailand) ఓ రైతు దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దాన్ని ఇంటికి తెచ్చుకుని పెద్ద డ్రమ్ములో నీళ్లు పోసి అందులోకి వదిలాడు. పాములాగా కదులుతున్న ఈ వింత జీవి ఒళ్లంతా ఆకుపచ్చని ఆకారంలో దట్టమైన గడ్డిలాంటి రోమాలు ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఇది కచ్చితంగా గడ్డి అనే భ్రమ కలుగుతుంది. అది కదిలినప్పుడు లేదా నోరు తెరిచినప్పుడు మాత్రమే అది మనకు తెలీని వింత జీవి అన్న విషయం తెలుస్తుంది. ఇక రైతు దానికి నీళ్లలో చేపలు వేస్తే అది ఎర్రటినోటితో అది తినేస్తోంది(Grass like snake eats fish).
తాను ఈ పాములాంటి జీవిని గతంలో ఎప్పుడూ చూడలేదని ఆ రైతు చెప్పాడు. త్వరలో దాన్ని శాస్త్రవేత్తలకు అప్పగిస్తానని అంటున్నాడు. ఇక వీడియో చూసిన నెటిజన్ల రియాక్షన్లకు అంతేలేకుండా పోయింది. కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను పెద్ద ఎత్తున పంచుకుంటున్నారు. ఇలాంటి జీవి తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదంటూ అనేక మంది చెప్పుకొచ్చారు. ప్రకృతిలో మానవుడికి తెలీని మిస్టరీలు అనేకం ఉన్నాయని, కాబట్టి డబ్బు, అధికారం, అందం వంటివాటిని చూసుకుని గ్వరంతో రెచ్చిపోకూడదంటూ కొందరు నీతిప్రబోధం కూడా చేశారు.