Share News

Viral: ఉడతకు ఇన్ని తెలివితేటలా! టూరిస్ట్ కనిపించగానే అతడి వద్దకు వెళ్లి ఏం చేసిందో చూస్తే..

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:08 PM

అన్ని జీవులకంటే మనిషి మేథోపరంగా గొప్పవాడే కానీ మిగతా జీవాలు కూడా సమయానికి, పరిస్థితులకు తగ్గట్టు మారుతుంటాయి.

Viral: ఉడతకు ఇన్ని తెలివితేటలా! టూరిస్ట్ కనిపించగానే అతడి వద్దకు వెళ్లి ఏం చేసిందో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అన్ని జీవులకంటే మనిషి మేధోపరంగా గొప్పవాడే కానీ మిగతా జీవాలు కూడా సమయానికి, పరిస్థితులకు తగ్గట్టు తమని తాము మార్చుకోగలవు. ఈ మార్పులు వారసత్వంగా తరువాతి తరాలకు బదిలీ అయితే మరింత మెరుగైన జాతులు పుట్టుకొస్తాయి. శాస్త్రవేత్తలకు అందరికీ ఇది తెలిసిందే. అయితే, అన్నీ తెలిసినా కూడా ఒక్కోసారి జంతువులు చేసే పనులు ఎవ్వరినైనా ఆశ్చర్యం కలిగించక మానవు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.

Photoshoot: స్టూడెంట్‌తో వివాదాస్పద ఫొటో షూట్‌..తమ బంధం ఎలాంటిదో చెప్పిన టీచర్!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, దాహంతో ఉన్న ఓ ఉడత (Thirsty Squirrel) టూరిస్టును చూడగానే అతడి వద్దకు పరుగు తీసింది. అతడి చేతిలో ఉన్న నీళ్ల బాటిల్‌తో దాహం తీర్చుకోవచ్చన్న విషయం దాని చిన్ని మెదడుకు చిటికెలో అర్థమైపోయింది. వెంటనే, అతడి వద్దకు వెళ్లి వెనక రెండు కాళ్లపై నిలబడి పైకి చూసింది. ఆపై ముందు రెండు కాళ్లూ బాటిల్ వైపు చూపిస్తూ పైకీ కిందకూ ఊపింది. ఉడత ఆరాటం అర్థం చేసుకోడానికి టూరిస్టులకు క్షణకాలం పట్టింది (squirrel approaches man for water). ఆ తరువాత ఆలస్యం చేయకుండా బాటిల్‌ను ఉడత నోటికి అందించడంతో అది గటగటా నీరు తాగి దాహం తీర్చుకుంది.

Viral: ఈ దారుణాలు విమానాల్లో కూడా జరుగుతాయా? ప్యాసెంజర్‌కు షాకింగ్ అనుభవం


ఇదంతా చూసిన నెటిజన్లు..మానవత్వం చూపించిన టూరిస్ట్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉడత తెలివి తేటలకు ఆశ్చర్యపోతున్నారు. మనుషుల ఉనికికి అలవాటు పడుతున్న జంతువుల్లో కూడా బోలెడన్నీ మార్పులు వచ్చేస్తు్న్నాయని అనేక మంది కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లలో అనేక రకాల ఆలోచనలు రేకెత్తిస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ముఖం కనబడకుండా నెత్తిపై చెంగు కప్పుకుని తిరుగుతున్న కోడలు.. అసలు విషయం తెలిసి అత్తింటి వారికి భారీ షాక్!

Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?

Viral: ఈ కుర్రాడు స్విగ్గీ‌కే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!

Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్‌ పెట్టి చూసుకుంటే.. దారుణం..

Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!

Updated Date - Dec 31 , 2023 | 03:18 PM