Viral Video: సడన్‌గా వచ్చి కూర్చున్న కోతి.. ఆ కుర్రాడు భయపడి పారిపోకుండా ఓ ప్లేట్‌లో పానీ పూరీలను పెట్టి ఇవ్వగానే..!

ABN , First Publish Date - 2023-06-22T22:17:44+05:30 IST

పానీపురి బండిమీద కూర్చుని పానీపురీలు ఆరగిస్తున్న కోతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: సడన్‌గా వచ్చి కూర్చున్న కోతి.. ఆ కుర్రాడు భయపడి పారిపోకుండా ఓ ప్లేట్‌లో పానీ పూరీలను పెట్టి ఇవ్వగానే..!

ఇంటర్నెట్ డెస్క్: అది గుజరాత్‌లోని మోర్బీ జిల్లా తంకారా ప్రాంతం. ఓ వ్యక్తి స్థానికంగా ఓ పానీపురీ బండి నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే అతడి బండి చుట్టూ కస్టమర్లు పానీపురీ తింటున్నారు. ఇంతలో ఓ కోతి అకస్మాత్తుగా బండిపై వచ్చి కూర్చుంది. అక్కడ అందరు జనాలు ఉన్నా అది భయపడలేదు. కానీ కస్టమర్లు మాత్రం దాన్ని చూసి కాస్తంత భయపడి వెనక్కు జరిగారు.

ఇదిలా ఉంటే బండి నిర్వహిస్తున్న వ్యక్తి మాత్రం ఏమాత్రం బెదరకుండా కోతి చేతిలో పానీపురీ పెట్టడం ప్రారంభించారు. అదేమో అచ్చం మనిషిలా వాటిని తింటూ ఎంజాయ్ చేయడం ప్రారంభించింది(Monkey eating panipuri). ఇతర కస్టమర్ ఒకరు ఈ ఉదంతాన్ని రికార్డు చేసి నెట్టింట షేర్ చేయడంతో వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది(Viral Video). జనాలకు కోతి తీరు నచ్చడంతో వారూ ఈ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పానీపురీ అంటే నచ్చనివారు ఎవరుంటారు చెప్పండి అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. కాగా, పానిపురీ తింటున్న ఓ ఆవు దూడ వీడియోను కూడా ఈ సందర్భంగా మళ్లీ వైరల్ అవుతోంది. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను యమాగా ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - 2023-06-22T22:17:48+05:30 IST