Viral: ఇది కదా అసలు సిసలు విజయమంటే.. స్కూలు మానేసి 24 ఏళ్లయిన తర్వాత.. ఆ మహిళకు ఏకంగా గ్రాడ్యుయేట్ పట్టా..!

ABN , First Publish Date - 2023-09-20T16:34:41+05:30 IST

చదువుకునే వయసు దాటిన తరువాత తప్ప చాలామందికి చదువు విలువ అర్థం కాదు. మరికొందరికి చదువుకోవాలనే కోరిక ఉన్నా పరిస్థితుల కారణంగా చదువు ఆపేయాల్సి వస్తుంది.

Viral: ఇది కదా అసలు సిసలు విజయమంటే.. స్కూలు మానేసి 24 ఏళ్లయిన తర్వాత.. ఆ మహిళకు ఏకంగా గ్రాడ్యుయేట్ పట్టా..!

చదువుకునే వయసు దాటిన తరువాత తప్ప చాలామందికి చదువు విలువ అర్థం కాదు. మరికొందరికి చదువుకోవాలనే కోరిక ఉన్నా పరిస్థితుల కారణంగా చదువు ఆపేయాల్సి వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆమెకు అలాంటి సమస్యే ఎదురయ్యింది. చక్కగా చదువుకుంటోంటే పెళ్లి, ఆ తరువాత పిల్లలు ఆమె చదువుకు బ్రేక్ వేశాయి. మళ్లీ చదువుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ పరిస్థితులు ఆమెను వెక్కిరిస్తూనే వచ్చాయి. కానీ ఆమె ఓపిక ముందు ఆ పరిస్థితులు కూడా తల వంచాయి. స్కూల్ వయసులో ఆగిపోయిన చదువు మళ్లీ పట్టాలెక్కింది. 42ఏళ్ళ వయసులో గ్రాడ్యుయేట్ పట్టాను అందుకుంది. తన కలను నిజం చేసుకున్న స్పూర్తివంతమైన ఈ మహిళ గురించి పూర్తీగా తెలుసుకుంటే..

జమైకా(Jamaica)కు చెందిన కెర్రీ హేమన్స్ అనే మహిళ తన 18వ ఏట పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత ఆమెకు వివాహం జరిగింది. వివాహం తరువాత చదువుకోవాలని అనుకుంది కానీ వివాహం జరిగిన కొన్నిరోజులకే ఆమె తల్లికావడంతో చదువుకు బ్రేక్ పడింది. పిల్లలు అయ్యాక మళ్లీ చదువుకోవాలని ఆమె ప్రయత్నించింది. కానీ ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి సాయుధ దళంలో పనిచేసేవాడు కావడంతో వారు ఒక చోట స్థిరంగా ఉండలేకపోయారు. ఒక దేశం నుండి మరొక దేశానికి నిరంతరం మారుతూ ఉండటంతో చదువుకోవడం సాధ్యం కాలేదు. స్కాట్లాండ్, జర్మనీ, సైప్రస్.. ఇలా ఒకటనేమిటి అన్ని దేశాలు తిరగాల్సి వచ్చింది.

Wife and Husband: కారులో కూర్చుని భార్య పాట పాడుతోంటే.. ఈ భర్త చేసిన నిర్వాకమేంటో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..!



ఆ తరువాత 2017లో యూకె లోని ఈస్ట్ స్టాఫోర్డ్‌షైర్‌లో తన అండర్ గ్రాడ్యుయేట్ ను ప్రారంభించింది. ఆ విషయాన్ని తన కొడుకు డెన్రిచ్ కు చెప్పింది. అండర్ గ్రాడ్యుయేట్ తరువాత మళ్లీ డిగ్రీ చేస్తానని ఆమె తన కొడుకుతో చెప్పింది. ఆ మాటను ఆమె నిలబెట్టుకుంది. ఆమె స్టాపోర్డ్ షైర్ విశ్వవిద్యాలయం(East Staffordshire university) నుండి హెల్త్ & సోషల్ కేర్ విభాగంలో కోర్సు పూర్తీ చేసింది. చదువు ఆగిపోయిన 24ఏళ్ళ తరువాత 42ఏళ్ళ వయసులో తన తల్లి మళ్లీ చదువు కొనసాగించి విజయం సాధించడంతో ఆమె కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. 'నా అక్కాచెల్లెళ్లకు మా అమ్మ పెద్ద రోల్ మోడల్ గా నిలుస్తుంది' అంటూ తల్లిని ప్రసంశించాడు.

Viral News: ఇదేం డిజైన్ బాబోయ్.. కొంపదీసి ఇది బెల్టు కాదు కదా..? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన డ్రస్సు..!


Updated Date - 2023-09-20T16:34:41+05:30 IST