Viral: ఏలియన్స్ నిజంగానే ఉన్నారా..? 40 ఏళ్ల క్రితం ఆ శాస్త్రవేత్త పంపిన మెసేజ్‌కు.. గ్రహాంతర వాసుల నుంచి రెస్పాన్స్..!?
ABN , First Publish Date - 2023-08-22T17:53:36+05:30 IST
అంతరిక్షంలో ఇతర గ్రహాలపై జీవం ఉందని, వారితో సంభాషించాలని ప్రపంచదేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈక్రమంలో 40ఏళ్ళ కిందట పంపిన ఓ సందేశానికి ప్రత్యుత్తరమొచ్చిందనే విషయం ప్రపంచానికి ఆసక్తిగా మారింది
ఏలియన్స్ లేదా గ్రహాంతర వాసులు ఈ ప్రపంచానికి ఎప్పుడూ ఆసక్తికరమైన విషయమే. భూ గ్రహం తరువాత మనిషి మనుగడకు అవసరమైన ప్రాంతం కోసం ప్రపంచదేశాలన్నీ ఎన్నో ఏళ్ళ నుండి పరిశోధనలు చేస్తున్నాయి. ఇతర గ్రహాలలో గ్రహాంతర వాసులు ఉంటారని విశ్వాసం ఉంది. కొందరు తాము ఆకాశంలో గ్రహాంతర వాసులను చూశామని చెబితే.. అవన్నీ కల్పనలని కొట్టిపడేసేవారున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఇతర గ్రహాలలో ఖచ్చితంగా జీవముందని, వారితో సంభాషించాలని చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి బీజం 40ఏళ్ళ కిందట పడింది. జపాన్ కు చెందిన ఓ శాస్త్రవేత్త 40ఏళ్ళ కిందట గ్రహాంతర వాసులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించారు. అందుకోసం వారికి 'హలో ఎవరైనా ఉన్నారా?' అంటూ సందేశాలు కూడా పంపించారు. అయితే 40ఏళ్ళ క్రితం పంపిన ఈ సందేశానికి ప్రత్యుత్తరం ఇప్పుడు అందిందనే విషయం ప్రవంచానికి ఆసక్తిగా మారింది. అసలింతకీ ఈ సందేశం ఎవరికి వెళ్ళింది? శాస్త్రవేత్తలు పంపిన సందేశాలకు స్పందించేది ఎవరు? శాస్త్రవేత్తలు అంచనాలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..
అంతరిక్షంలో ఇతర గ్రహాలపై జీవం ఉందని, వారితో సంభాషించాలని ప్రపంచదేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇతర గ్రహాలపై జీవం ఉందని జపాన్‌కు(Japan) చెందిన ప్రముఖ శాస్త్రవేత్త మసాకి మోరిమోటో(Masaki MORIMOTO) కనుగొన్నారు. ఈయన 1983 ఆగస్టు 15న అంతరిక్షంలో ఉన్న మరో గ్రహానికి సందేశం పంపారు. 'హలో, ఎవరైనా ఉన్నారా?' అనేది ఈ సందేశ సారాంశం. టోక్యో విశ్వవిద్యాలయంలోని టోక్యో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్నప్పుడు ఈయన ఈ సందేశాన్ని ప్రసారం చేశారు. ఈ సందేశం పంపినప్పటి నుండి ఇతర గ్రహాల నుండి ప్రత్యుత్తరం వస్తుందేమోనని ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నిరీక్షణకు తెర పడబోతోందని, గ్రహాంతర వాసులనుండి ప్రత్యుత్తరం అంది ఉంటుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేశాన్ని స్వీకరించడానికి జపాన్ లోని సాకు వద్ద ఉన్న జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ 64మీటర్ల వ్యాసంకలిగిన యాంటెన్నాను సిద్దం చేసింది. ఆగస్టు 22 రాత్రి 10గంటలకు ఈ యాంటెన్నా ఆకాశాన్ని స్కాన్ చేయడం ప్రారంభించనుంది.
Wife: బయటకు వెళ్లిన భర్త.. ఇంట్లో అత్త ఒక్కతే ఉందని తెలిసి.. ఆ నవవధువు ఏం చేసిందంటే..!
నిజానికి మసాకి మోరిమోటో గ్రహాంతర వాసులకు సందేశం పంపి 40ఏళ్ళు అయ్యింది కదా ఇప్పటికిప్పుడు ప్రత్యుత్తరం గురించి హడావిడి ఏమిటని చాలామందికి సందేహం కలుగుతుంది. కానీ జపాన్ లో స్టార్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇది జపాన్ క్యాలెండర్ ప్రకారం 7వ నెల, 7వ తేదీన జరుపుకుంటారు. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఆగస్టు 22 అయ్యింది. ఈ కారణంగా వారికి ఇతర గ్రహాల నుండి తప్పకుండా ప్రత్యుత్తరం వస్తుందని అంటున్నారు. ఈ ప్రత్యుత్తరం కూడా భూమికి 16.7 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆల్టెయిర్ నుండి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఆల్టెయిర్ అనేది ఆకాశంలో ఉండే ప్రకాశవంతమైన నక్షత్రాలలో 12వది. ఇది అక్విలా కూటమిలో ఉంది. 1990 నుండి పెద్ద సంఖ్యలో ఎక్సోప్లానెట్ లు కనుగొనబడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణంగా ఆల్టెయిర్ నుండి తప్పకుండా సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. అయితే 40ఏళ్ళ కిందట ఈ సందేశం పంపిన ప్రొపెసర్ మసాకి మోరిమోటో ఈ ప్రపంచంలో లేరు. ఈయన 2010లోనే మరణించారు. ఈయన బృందంలో ఒకరైన షిన్యా నరుసావా(58) ప్రస్తుతం ఈ పనులన్నీ చూస్తున్నారు. ఈ ఒక్కరాత్రి ఎదురుచూస్తే ఇతర గ్రహాలనుండి సమాచారం ఏదైనా అందిందా లేదా అనే విషయం తెలిసిపోతుంది.