Viral: ఓ మహిళకు చాలా ఏళ్ల నుంచి నడుమునొప్పి.. చివరకు భరించలేక ఆస్పత్రికి వెళ్తే టెస్టులు చేసిన డాక్టర్లే షాక్.. 20 ఏళ్లుగా..!
ABN , First Publish Date - 2023-07-27T11:35:10+05:30 IST
చాలామటుకు పెయిన్ కిల్లర్లు వేసుకుని, మూవ్ రాసుకుని ఉపశమనం పొందుతుంటారు. ఓ మహిళ ఏళ్లకేళ్లుగా అదే పని చేసింది. కానీ ఆ తరువాత బయట పడిన నిజంతో..
మహిళలలో నడుము నొప్పి సహజం. మరీ ముఖ్యంగా ప్రసవానంతరం ఈ నొప్పిని ఎక్కువగా అనుభవిస్తుంటారు. చాలామటుకు పెయిన్ కిల్లర్లు వేసుకుని, మూవ్ రాసుకుని ఉపశమనం పొందుతుంటారు. ఓ మహిళ ఏళ్లకేళ్లుగా అదే పని చేసింది. ఆమెకు సుమారు 20ఏళ్లుగా నడుము నొప్పి ఉన్నా ఆమె ఏనాడు వైద్యుడిని కలవలేదు. కేవలం మందులతో తాత్కాలిక ఉపశమనంతో కాలం వెళ్ళబుచ్చింది. కానీ ఒక రోజు భరించలేని నొప్పి ఆమెను చుట్టుముట్టింది. ఆ నొప్పి భరించడం ఆమె వల్ల కాలేదు. దీంతో వైద్యుడిని సంప్రదించింది. ఆమెకు టెస్టులు చేసిన వైద్యులు షాకయ్యారు. ఆమె ఇన్నాళ్ళు ఎలా బ్రతికుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది వైద్యులకు. అందరినీ ఆశ్చర్యపరిచే ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాలోకి వెళితే..
అమెరికా(America)దేశంలో ఇల్లినాయిస్ రాష్ట్రంలో నివసించే ఓ మహిళకు షాకింగ్ నిజం తెలిసింది. అమీ గారిసన్ అనే మహిళ సౌత్ ఇల్లినాయిస్ లో తన భర్తతో కలసి పొలంలో ఏర్పాటుచేసుకున్న ఇంట్లో నివసిస్తోంది. వీరికి చుట్టు ప్రక్కల ఇతర ఇళ్లు, జనసంచారం ఏమీ లేదు. ప్రశాంత వాతావరణంలో నివసించాలని కోరుకునే అమీ గారిసన్ కు ఆ ప్రదేశమంటే ఎంతో ఇష్టం. కానీ ఆమె మాత్రం తనకు నచ్చిన ప్రదేశంలో నివసిస్తున్నా గత 20ఏళ్ళ నుండి సంతోషంగా లేదు. దీనికి కారణం నడుమునొప్పి(back pain). కూర్చున్నా, లేచినా, నడిచినా ఆమెను తీవ్రమైన నడుమునొప్పి వేధించేది. వీటికి పెయిన్ కిల్లర్లు వేసుకుని, పెయన్ రిలీఫ్ జెల్ రాసుకుని ఉపశమనం చెందేది. ఒకరోజు ఈ నడుము నొప్పి తీవ్రరూపం దాల్చింది. ఆమె కాళ్ళు, పిరుదులు, పాదాలలో మండుతున్నట్టుగానూ, పొడుస్తున్నట్టుగానూ అనిపించింది. వీటి మధ్య ఏ పని చేసుకోలేకపోవడమే కాకుండా తిండి, నిద్ర కూడా సరిగా లేకుండా తయారైంది పరిస్థితి. ఈ క్రమంలో ఆమె వైద్యులను సంప్రదించింది.
Fridge: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. కొత్త ప్రిడ్జ్ కొనాల్సిందే.. ఫ్రిడ్జ్ పాడయిపోయిందని ఎలా గుర్తు పట్టాలంటే..!
అమీ గారిసన్ నొప్ప గురించి తెలుసుకున్న వైద్యుడు కారణం తెలుసుకోవడానికి ఆమెకు కొన్ని టెస్టులు చేశారు. నడుము ప్రాంతంలో ఎక్స్ రే తీశారు. ఆ రిపోర్ట్ చూసిన వైద్యులు షాకయ్యారు. అమీ గారిసన్ వెన్నెముకలో సుమారు రెండు అంగుళాల పొడవున్న సూది(2inch needle) ఉండటం వారు గమనించారు. దాని గురించి ఆమెను ప్రశ్నించగా ఆమెకు 20ఏళ్ల క్రితం నాటి సంఘటన గుర్తొచ్చింది. ఆమె 20ఏళ్ళ క్రితం ఫ్లోరిడాలోని నౌకాదళ ఆసుపత్రిలో ప్రసవించింది. ఆ సమయంలో ఆమెకు అనస్థీషియాలజిస్ట్ ఆమె వెన్నెముక భాగంలో ఇంజెక్షన్ చేసినట్టు గుర్తుందని చెప్పింది. ఆ తరువాత వైద్యులు, నర్స్ లు కూడా ఆమెతో ఏ విషయం చెప్పలేదు. గత వారం గారిసన్ వెన్నెముకలో ఉన్న సూది భాగాన్ని వైద్యులు తొలగించారు. దీని తరువాత ఆమెకు కొన్ని సమస్యలు తగ్గాయని, మరికొన్నింటి పరిష్కారానికి ఫిజియోథెరపీ చేయించుకుంటోందని తెలిసింది. కాగా ఈ సమస్యకు కారణమైన నౌకాదళ ఆసుపత్రికి వ్యతిరేకంగా ఆమె దావా వెయ్యగా దాన్ని కోర్డు కొట్టివేసింది.