Viral: భార్య పనితీరు ఎలా ఉంది..? అంటూ జీవిత భాగస్వామి గూర్చి రివ్యూ ఇచ్చాడు.. మరుక్షణమే అతడు కలలో కూడా ఊహించని సీన్..!
ABN , First Publish Date - 2023-06-23T14:18:53+05:30 IST
ప్రతి ఇంట్లో మహిళలు ఇంటి పని, వంట పని చేయడం, పిల్లలు, భర్త బాగోగులు చూసుకోవడం చేస్తుంటారు. ఇక ఇంటికి చుట్టాలు, స్నేహితులు వస్తే వారికి తగిన మరద్యాలు చేయడం వంటి అదనపు శ్రమ కూడా ఉంటుంది. ఇలా ఒకటనేమిటి ఎన్నో
ప్రతి ఇంట్లో మహిళలు ఇంటి పని, వంట పని చేయడం, పిల్లలు, భర్త బాగోగులు చూసుకోవడం చేస్తుంటారు. ఇక ఇంటికి చుట్టాలు, స్నేహితులు వస్తే వారికి తగిన మరద్యాలు చేయడం వంటి అదనపు శ్రమ కూడా ఉంటుంది. ఇలా ఒకటనేమిటి ఎన్నో పనులు చేస్తుంటారు. ఇలా మల్టిటాస్కులు చేస్తే అప్పుడు శభాష్, చక్కని ఇల్లాలు అనే బిరుదు దక్కుతుంది. అలా కాకుండా ఇంట్లో భర్తను, పిల్లలను తిట్టడం, తప్పులు చేయడం చేస్తే ఆ ఇల్లాలి గురించి ఎక్కడలేని అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఓ భర్త తన భార్య పనితీరు గురించి చెబుతూ రివ్యూ ఇచ్చాడు. ఇలా జరిగిన మరుక్షణమే అతను ఊహించని సంఘటన చోటుచేసుకుంది. అతని విషయంలో నెటిజన్లు చాలా గుర్రుగా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఇంట్లో ఆడవాళ్లు(house wives) ఒకటికి నాలుగు పనులు చేస్తుంటారు. ఆ ఒత్తిడిలో ఇంట్లో పిల్లల మీద లేద భర్త మీద అరిచేస్తుంటారు. మరికొందరు అయితే వారిదే పై చేయి ఉండాలని కోరుకుంటారు. పిల్లలు, భర్త తను చెప్పినట్టు వినాలని అనుకుంటారు. ఓ భర్త తన భార్య ప్రవర్తన గురించి చెబుతూ.. 'మా ఇంట్లో నేను, నా భార్య, నా కూతురు(13), నా మేనకోడలు(15), నా కొడుకు(6) ఉంటాం. అందరిలోకి నా భార్య చాలా డైనమిక్ గా ఉంటుంది. ఆమె అన్నీ కంట్రోల్ చేస్తుంది. పిల్లలను కారణం లేకుండా తిడుతుంది. ఆమెకు చెప్పకుండా ఏ పని చేయడానికి ఆమె ఒప్పుకోదు. పిల్లలను చేయవద్దు అని చెప్పి ఆమె మాత్రం ఆ పనులు చేస్తుంది, ఆ తరువాత సమర్థించుకుంటుంది. తన తప్పు ఉన్నట్టైతే అబద్దాలు చెబుతుంది. చాలా పక్షపాతం చూపిస్తుంది. నేను ఆమెచేసే మంచి పనులకు ప్రసంశలు ఇస్తాను. పిల్లల విషయంలో అందరినీ సమానంగా చూడాలని కోరుకుంటాను. ఆమె చేస్తున్న తప్పులు చెప్పడం ద్వారా ఆమె ఇకమీదట అయినా న్యాయంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఆమె చాలా విషయాల్లో మెరుగవ్వాలి. అందుకే ఈ రివ్యూ ఇచ్చాను' అని అతను రెడ్డిట్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేశాడు.
Viral: సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రియుడు పక్కాగా ప్లాన్ చేసి పిలిస్తే.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రేయసి.. అతడు పిలిచిన చోటకు వెళ్లి చూస్తే..!
అతని రివ్యూ చూసిన అతని భార్య గంటసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిందట. ఆ తరువాత ఆమె పెద్ద బాంబు పేల్చింది. అదే విషయం అతను చెబుతూ 'నేను చెప్పినట్టు జరగాలంటే ఆమెకు ఒక ప్రైవేట్ బ్యాంక్ ఖాతా కేటాయించి ప్రతి వారం నాకు వచ్చే శాలరీలో సగం అందులో జమ చేయాలి. అదంతా ఆమె దుర్వినియోగం చేస్తుంది. ఇది చాలా పైశాచికమైన చర్య' అని అతను చెప్పుకొచ్చాడు. ఇదంతా చదివిన నెటిజన్లు సదరు భర్త మీద మండిపడుతున్నారు. 'ఆమె చేసే పనులకు మీరు ఇలా అభిప్రాయపడటం కరెక్టే.. కానీ ఆ విషయాన్నంతా సోషల్ మీడియాలో వెలిబుచ్చడం సరైన పద్దతి కాదు' అని అంటున్నారు. 'మీరు ఆమెకు భాగస్వామా లేక యజమానా? యజమానులే ఇలా పనికి మార్కులు, రివ్యూలు ఇస్తారు. భాగస్వాములు అలా చెయ్యరు' అని మరికొందరు కామెంట్ చేశారు. 'ఆమె పని గురించి రివ్యూ ఇచ్చి ఆమె మీద మీకున్నగౌరవం ఏపాటిదో బానే స్పష్టం చేశారు' అని ఇంకొకొరు అన్నారు. వీరి కుటుంబం మొత్తానికి మానసిక చికిత్స అవసరం అని ఇంకొకరు కామెంట్ చేశారు.