Viral: గే అని తెలిసి జాబ్‌లోంచి తీసేశారని బాధపడ్డాడు కానీ.. 4 ఏళ్లు తిరిగేసరికి రూ.40 లక్షల టర్నోవర్.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..!
ABN , First Publish Date - 2023-08-08T10:46:19+05:30 IST
సమాజం నుండి వ్యతిరేకత, సమాజంలో బ్రతుకు తెరువు కోల్పోయాక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కానీ ఇతను మాత్రం కొత్తగా ఆలోచించాడు.
ఎద్దు పుండు కాకికి ముద్దు అనే సామెత వినే ఉంటారు. ఎద్దుకైన పుండును తన ముక్కుతో పొడిచి మరీ కాకి ఆనందిస్తుంది. దాన్ని ఆహారంగా స్వీకరిస్తుంది. ఈ ప్రపంచంలో స్వలింగ సంపర్కుల పరిస్థితి కూడా అలాగే ఉంది. స్వలింగ సంపర్కులంటే చాలామందికి చిన్న చూపు. వారికి కనీసం గౌరవం ఇవ్వకపోగా ఎన్నో ఇబ్బందులకు గురిచెయ్యడం, సూటిపోటి మాటలనడం చేస్తుంటారు. మిథున్ ఛటర్జీ తన జీవితంలో ఇలాంటివెన్నో అనుభవించాడు, భరించాడు. చివరికి గే అనే కారణంగానే అతను తన ఉద్యోగం కోల్పోయాడు కూడా. సమాజం నుండి వ్యతిరేకత, సమాజంలో బ్రతుకు తెరువు కోల్పోయాక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కానీ మిథున్ ఛటర్జీ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. తనను అర్థం చేసుకోలేక పోయిన సమాజానిదే తప్పని అనుకున్నాడు. ఒకరి కింద పనిచేస్తూ మాటలు పడకుండా తనే ఓ దారి ఏర్పాటు చేసుకున్నాడు. అదిప్పుడు కేవలం అతన్నే కాదు, అతనిలాంటి ఎంతో మందిని నడిపిస్తోంది. ఇతని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ప్రముఖ డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ నటించిన కాంచన సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. స్వలింగ సంపర్కులు( Homosexuals) సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెరమీద చూపించిన చిత్రమది. కుటుంబ పరంగానూ, సమాజపరంగానూ ఎదురయ్యే వ్యతిరేకతను భరిస్తూ తమకు నచ్చినట్టు బ్రతకడం కోసం యుద్దమే చేస్తుంటారు స్వలింగ సంపర్కులు. పశ్చిమ బెంగాల్(West Bengal) కు చెందిన మిథున్ ఛటర్జీ(Mithun chattarjee) కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నాడు. తాను పెరిగే కొద్ది అబ్బాయిని కాదని అర్థం చేసుకున్నాడు. కుటుంబానికి, సమాజానికి తాను గే అనే విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. కానీ ఇతని ప్రవర్తనను బట్టి ఇతను వెళ్లిన ప్రతిచోట ఇతన్ని అంచనా వేశారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ సమయంలో ఇతను ప్రమేయం లేకపోయినా గే అనే కారణంతో డబ్బు దొంగతనాలను కూడా భరించాల్సి వచ్చింది. అన్ని భరించి ఇతను ఎంబిఏ పూర్తీ చేశాడు. ఈ విద్యార్హత తోనే ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ అక్కడా అతను ఊహించని సంఘటన జరిగింది. 2018-19 సంవత్సరంలలో ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. అతను గే అనే విషయం ఆఫీసులో ఎవరితో చెప్పలేదు. ఈ క్రమంలో మిథున్ ఒక పార్టీకి హాజరయ్యాడు. హోటల్ గదిలో ఉన్న సమయంలో కంపెనీకి సంబంధించిన కొందరు వ్యక్తులు హోటల్ గదిలోకి జొరబడి అతని గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత కంపెనీలో అందరి ముందు అతన్ని అవమానించారు. ఈ సంఘటన తరువాత మిథున్ కంపెనీ వదిలి వెళ్లిపోయాడు. చిన్న బార్బర్ షాప్ పెట్టుకున్నాడు. కానీ కరోనా కారణంగా అతను షాపు మూసేయాల్సి వచ్చింది.
Weight gain Food: ఎంత తిన్నా సరే.. కొందరికి ఒంట్లో పిడికెడు కండ కరువు.. అలాంటోళ్లు బరువు పెరగాలంటే..!
స్వలింగ సంపర్కులకు ఎక్కడా గౌరవం, మర్యాద లేవని ఇతను అర్థం చేసుకున్నాక తనే ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తనకోసం తనే కాదు, తనలాంటి వారికోసం కూడా ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనతో 2021లో గే కమ్యూనిటీ ప్రజల కోసం ఒక వెల్ నెస్ సెంటర్ తో పాటు, ఒక కేప్ అవుల్ లెట్ ను ఢిల్లీలో ప్రారంభించారు. భారతదేశంలో స్వలింగ సంపర్కుల కోసం ప్రారంభించబడిన మొదటి కేప్ ఇదే(India's first LGBT cafe) దీనికి 'బెల్లిసిమో కేప్' అని నామరకణం చేశారు. ఈ కేప్ ప్రారంభించడానికి సుమారు 10-12లక్షలు అవసరమయ్యాయి. గే కమ్యూనిటీ లో ఉన్న ఎంతోమంది మిథున్ కు సహాయం చేశారు. ఈ కేప్ పెట్టినప్పుడు మొదటి ఏడాది 4-5 లక్షల ఆదాయం వచ్చింది. ఇది ఏడుకేడు పెరుగుతూ నేడు 40లక్షల టర్నోవర్ తో సాగుతోంది. మిథున్ ఈ కేఫ్ పెట్టడం వల్ల అతను మాత్రమే ఎదగకుండా తనలాంటి 8మందికి ఉద్యోగం ఇచ్చాడు. వారిని గౌరవంగా నడిస్తున్నాడు.