Home » West Bengal
అందరూ కలిసికట్టుగా ఉద్యమం ప్రారంభిద్దామని కొందరు రెచ్చగొట్టవచ్చని, అయితే ఆ పని చేయవద్దని మమతా బెనర్జీ కోరారు. మైనారిటీలు, వారి ఆస్తులకు తాము కాపాడతామని అన్నారు.
వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారంనాడు జాంగిపూర్ పీడబ్ల్యూబీ మైదానం నుంచి బయలు దేరిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నేషనల్ హైవేను దిగ్బంధం చేసేందుకు జాంగ్పూర్ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రిక్రూట్మెంట్ ప్రక్రియ రద్దు చేయడంతో వేలాది మంది అర్హులైన టీచర్లు ఉపాధి కోల్పోయినట్టు శిక్షక్ శిక్షకా అధికార్ మంచ్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని, రాష్ట్రపతి జోక్యం కోరుతూ లేఖ రాయాల్సిందిగా తనకు విజ్ఞప్తి చేశారని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Ram Navami Rally: రామ నవమిని పురష్కరించుకుని నిన్న పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఏకంగా 2000 వేలకుపైగా ర్యాలీలు జరిగాయి. పార్క్ సర్కస్ సెవెన్ పాయింట్ ఏరియాలో మాత్రం ర్యాలీగా వెళుతున్న భక్తులపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో ఎండలు పెరగనున్నాయి
గత ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ ఏడాది ఊరేగింపులకు అనుమతి ఇవ్వరాదని బెంగాల్ పోలీసులు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.
సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్లో 25 వేలమంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం నియామక ప్రక్రియ అవకతవకలతో నిండి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25 వేల మంది ఉపాధ్యాయుల ఎంపిక చెల్లదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ఈ స్కామ్ ఎక్కడ వెలుగు చూసింది.. ఎప్పుడు చోటు చేసుకుంది వంటి వివరాలు మీ కోసం..
కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదని న్యాయవాదులు విమర్శిస్తూ, జస్టిస్ దినేశ్ శర్మ బదిలీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆయనకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని, కోర్టు విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు
బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో సోమవారంనాడు జరిగిన ఈద్ ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు.