Share News

Viral: పిల్లలు పుట్టకుండా ఆపరేషన్.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక టీ తాగేందుకు వెళ్లిన డాక్టర్.. 4 గంటల తర్వాత తిరిగొచ్చి..!

ABN , First Publish Date - 2023-11-09T15:00:27+05:30 IST

ఓ వైద్యుడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసే సమయంలో పేషెంట్లకు మత్తు మందు ఇచ్చి టీ తాగేందుకు వెళ్ళాడు. ఈ తరువాత 4గంటలకు కానీ అతను తిరిగిరాలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి.

Viral: పిల్లలు పుట్టకుండా ఆపరేషన్.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక టీ తాగేందుకు వెళ్లిన డాక్టర్.. 4 గంటల తర్వాత తిరిగొచ్చి..!

దేవుడు మనిషికి జన్మను ఇస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని అంటారు. సాధారణ సమయాల్లోనే కాకుండా కోవిడ్ లాంటి ప్రత్యేక సమయాల్లో డాక్టర్ల కృషి స్పషమైంది. అయితే కొందరు డాక్టర్లు మాత్రం రోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు రోగులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఓ వైద్యుడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసే సమయంలో పేషెంట్లకు మత్తు మందు ఇచ్చి టీ తాగేందుకు వెళ్ళాడు. ఈ తరువాత 4గంటలకు కానీ అతను తిరిగిరాలేదు. ఈ సంఘటన మీద ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం నాగ్పూర్(Nagpur) లో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్ లోని పార్సియోని గ్రామంలో వైద్యకేంద్రంలో బాలవి అనే వైద్యుడు పనిచేస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన గర్భనిరోధక శస్త్రచికిత్స(contraception surgery) శిబిరాన్ని డాక్టర్ బాలవి పనిచేసే అసుపత్రికి 50 కి.మీ దూరంలో ఉన్న ప్రాథమిక సంరక్షణా కేంద్రంలో నిర్వహించారు. ఈ శిబిరానికి 7గురు మహిళలు, ఒక పురుషుడు హాజరయ్యారు. ఇందులో ఒక సర్జరీ చేయడానికి అరగంట సమయం పడుతుంది. కొన్ని సర్జరీలు చేసిన తరువాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నలుగురు పేషెంట్లకు మత్తుమందు(anesthesia) ఇచ్చిన తరువాత డాక్టర్ బాలవి ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చారు. ఆయన ఆసుపత్రి నుండి బయటకు వెళ్లి నేరుగా తన వాహనాన్ని స్టార్ట్ చేసి 40కి.మీ ల దూరంలో ఉన్న తన నివాసానికి టీ తాగేందుకు వెళ్లారు. అలా వెళ్లిన ఆయన తిరిగి రాత్రికి వచ్చారని, మత్తుమందు ఇచ్చిన పేషెంట్లు అలాగే ఆపరేషన్ థియేటర్ లో ఉండిపోయారని గ్రామస్థులు, పేషెంట్ల తాలూకూ వ్యక్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: Viral: జపాన్ నుంచి వైద్య బృందం.. ఏరికోరి మరీ కేరళలోని ఆ ఆస్పత్రికి ఎందుకు వచ్చింది..? ఓ 9 ఏళ్ల పిల్లాడి విషయంలో..!



జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తరువాత అధికారులు డాక్టర్ బాలవి గురించి విచారణ చేపట్టారు. డాక్టర్ బాలవికి మధుమేహం ఉందని, శస్త్రచికిత్స సమయంలో ఆయనకు హైపోగ్లైసీమిక్ అటాక్ వచ్చిందని చెబుతున్నారు. డాక్టర్ అప్పటికే అక్కడున్నవారిని టీ అడిగారని, ఆయనకు ఎవరూ టీ అందించలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఆయన వెళ్లిపోయారని అంటున్నారు. కాగా చక్కెర స్థాయిలు పడిపోయిన పరిస్థితిలో 40కి.మీ దూరం సొంతంగా వాహనాన్ని నడుపుతూ వెళ్లడానికి శరీరం ఎలా సహకరించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Teacher Video: తరగతి గదిలో విద్యార్థులు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న టీచర్.. గొడవ పడుతున్నారని పరుగెత్తుకుంటూ వస్తే..!


Updated Date - 2023-11-09T15:00:28+05:30 IST