Viral News: ఇతనిలా చేశాడేంటి? స్నేహితుని అంత్యక్రియల్లో చితిముందు నిలబడి అందరూ చూస్తుండగానే..

ABN , First Publish Date - 2023-05-28T19:19:08+05:30 IST

ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించగా అతన్ని దహనం చేయడానికి తీసుకెళ్ళారు. చితి పేర్చి అతన్ని దహనం చేశాక అక్కడే ఉండి ఏడుస్తున్న అతని స్నేహితుడు ఎవరూ ఊహించని పని చేశాడు.

Viral News:  ఇతనిలా చేశాడేంటి?  స్నేహితుని అంత్యక్రియల్లో  చితిముందు నిలబడి అందరూ చూస్తుండగానే..

రక్తసంబంధం తరువాత అంతగా మనుషుల కోసం తపించే బంధం ఏదైనా ఉందంటే అది స్నేహమే.. ఆర్థిక కష్టాలు అయినా, మానసిక సమస్యలు అయినా వేరే ఇతర బాధలు అయినా ఎలాంటి సంకోచం లేకుండా స్నేహితులతోనే పంచుకోగలం. చిన్ననాటి స్నేహితుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు చిన్ననాటి స్నేహితుల(Childhood friends) విషయంలో జరిగిన సంఘటన చాలా షాకింగ్ గా ఉంది. ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించగా అతన్ని దహనం చేయడానికి తీసుకెళ్ళారు. చితి పేర్చి అతన్ని దహనం చేశాక అక్కడే ఉండి ఏడుస్తున్న అతని స్నేహితుడు ఎవరూ ఊహించని పని చేశాడు. ఈ సంఘటనతో అందరూ షాక్ లోకి వెళ్శిపోయారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం షికోహాబాద్ లోని మాదయ్య నదియా అనే గ్రామంలో అశోక్ కుమార్ అనే వ్యక్తి నివసించేవాడు. అదే జిల్లా పంచవటి గ్రామంలో ఆనంద్ గౌరవ్ అనే వ్యక్తి నివసించేవాడు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. కలసి ఆడుకున్నారు, కలసి చదువుకున్నారు. చివరికి వ్యవసాయం కూడా కలసే చేస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఏ పనీ చేసేవారు కాదు. అయితే అశోక్ కుమార్ కు క్యాన్సర్(cancer) వచ్చింది. అతను క్యాన్సర్ తో బాధపడుతూ శనివారం ఉదయం మృతిచెందాడు(died with cancer). తన స్నేహితుడు చనిపోవడంతో ఆనంద్ చాలా దుఃఖంలో మునిగిపోయాడు. శనివారం సాయంత్రం అందరూ కలసి అశోక్ మృతదేహాన్ని దహనం చెయ్యడానికి సరుపూర్ ఘాట్ కు చేరుకున్నారు. ఆనంద్ కూడా ఏడ్చుకుంటూ అక్కడికి పరుగు పరుగున వెళ్ళాడు. అక్కడ చితి పేర్చి అశోక్ మృతదేహానికి నిప్పంటించారు. చీకటి పడుతుండటంతో చాలామంది అక్కడినుండి వెళ్ళిపోయారు. కొందరు మాత్రం అక్కడే ఉన్నారు. అదే సమయంలో తన స్నేహితుడి మరణం జీర్ణించుకోలేని ఆనంద్ 'హరి ఓం-హరి ఓం' అని దేవుడిని ప్రార్థిస్తూ చితిమంటల్లోకి దూకేశాడు.

Health Tips: తలనొప్పి వస్తే పెయిన్ కిల్లర్లు వాడుతున్నారా? ఇలా చేశారంటే నిమిషాల్లో తగ్గిపోవడం ఖాయం..


అప్పటిదాకా అక్కడున్న వాళ్ళు ఆనంద్ అలా చేసేసరికి ఉలిక్కిపడ్డారు. ఆనంద్ ను బయటకు ఎలా తీయాలో వారికి అర్థం కాలేదు. వెంటనే అటూ ఇటూ చూసి దగ్గలో ఉన్న కర్రలు తీసుకుని అతన్ని బయటకు లాగారు. ఆ తరువాత చికిత్స నిమిత్తం ఆగ్రాకు తీసుకెళ్ళారు. హాస్పిటల్ లో అతన్ని పరిశీలించిన వైద్యులు అతని శరీరం 90శాతం కాలిపోయిందని తెలిపారు. చికిత్స చేస్తుండగానే ఆనంద్ మరణించాడు. ఇద్దరు స్నేహితులు ఇలా మరణించడంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం అలముకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి విచారణ జరుపుతున్నారు.

Viral Video: బామ్మను బైక్ వెనుక సీటులో కూర్చోబెట్టుకుని యమా స్పీడ్ గా వెళ్తున్న పిల్లాడు.. పక్కనే వెళుతున్న కారు ప్రయాణీకుడికి ఊహించని షాక్..


Updated Date - 2023-05-28T21:10:53+05:30 IST