Viral News: మీరు ఈ కంపెనీలో చేరి పదేళ్లు పూర్తయిందంటూ.. యాపిల్ కంపెనీ ఇచ్చిన గిఫ్టును చూసి అంతా షాక్..!
ABN , First Publish Date - 2023-11-01T10:40:13+05:30 IST
యాపిల్ కంపెనీలో చేరి 10ఏళ్ళ పాటు సేవలు అందించినందుకు ఓ వ్యక్తికి ఇచ్చిన బహుమతిని చూసిన తరువాత నెటిజన్ల దిమ్మ తిరిగిపోతోంది.
ఒక కంపెనీ స్థాపించబడిన తరువాత అందులో పనిచేసే ఉద్యోగుల కష్టమే దాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుంది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కృషిని గుర్తించి వార్షికోత్సవాలకు ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తాయి. మరికొన్ని సంస్థలు కంపెనీ గుర్తుగా ప్రత్యేక బహుమతులు అందజేస్తాయి. ప్రపంచంలో యాపిల్ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యాపిల్ కంపెనీలో చేరి 10ఏళ్ళ పాటు సేవలు అందించినందుకు ఓ వ్యక్తికి ఇచ్చిన బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంపెనీ ఇచ్చిన బహుమతి ఏంటో తెలిసి నెటిజన్లు కూడా షాకవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
టెక్నాలజీ రంగంలో యాపిల్(Apple)స్థానమే వేరు. అలాంటి కంపెనీలో పనిచేసే అవకాశం కొందరికే వస్తుంది. యాపిల్ కంపెనీలో మార్కోస్ అలోన్సో అనే వ్యక్తి హ్యూమన్ ఇంటర్ ఫేస్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. తాజాగా అతను ఆ కంపెనీలో తన 10ఏళ్ళ సర్వీస్ పూర్తీ చేసుకున్నాడు. ఈ సందర్భంగా యాపిల్ కంపెనీ అతనికి ప్రత్యేక బహుమతి ఇచ్చింది(Apple gift for 10years service complete). ఈ బహుమతి ఫోటోలను మార్కోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇతనికి లభించిన బహుమతిలో ఐకానిక్ రిఫ్లెక్టివ్ యాపిల్ లోగో, అతని పేరు, దానిపై 10సంవత్సరాల వార్షికోత్సవ తేదీతో కూడిన మెటల్ మెమెంటో ఉన్నాయి. 10ఏళ్ళ మైలురాయిని చేరుకున్నందుకు, యాపిల్ తో అన్నేళ్ళు పనిచేసినందుకు, యాపిల్ కు మంచి సేవలు అందించినందుకు అభినందనలు తెలియజేస్తూ యాపిల్ సిఈఓ టిమ్ కుక్(Apple CEO Tim Cook) ప్రశంసను కూడా అందులో పొందుపరిచారు. ఈ మొత్తం వివరాలు మార్కోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
Health Tips: బరువు తగ్గేందుకు కొత్త రూల్.. డైట్ పాటించకుండా.. జిమ్‌లో కసరత్తులు కూడా చేయకుండానే..!
ఈ బహుమతి గురించి యాపిల్ ఉద్యోగి అయిన Marcos Alonso తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో షేర్ చేశారు. యాపిల్ సంస్థలో 10ఏళ్ళు పూర్తైనట్టు క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఇది చూసిన నెటిజన్ల రియాక్షన్ మాములుగా లేదు. కొందరు మార్కోస్ ను అభినందించారు. '10ఏళ్ళు యాపిల్ సంస్థలో పనిచేసినందుకు డ్యూడ్ కి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది' అని ఒకరు కామెంట్ చేశారు. '10ఏళ్ళు పూర్తయ్యాయి సరే సంతోషం. కానీ ఆ బహుమతి ఏంటి?' అని ఇంకొకరు బహుమతిలో ఏమీ లేదని తేల్చిపడేశాడు. 'స్టీల్ బాక్సులో సబ్బు ఉన్నట్టుంది ఈ బహుమతి. దీని వల్ల ఏం ఉపయోగం?' అని ఇంకొకరు కామెంట్ చేశారు.