Share News

Viral News: అది కారా.. లేక టపాసుల దుకాణమా.. రోడ్డుపై వెళ్తూ వీరు చేసిన పని తెలిస్తే..

ABN , First Publish Date - 2023-10-20T11:38:46+05:30 IST

ఏమాత్రం సామాజిక భాద్యత లేకుండా ఈ కుర్రాళ్లు చేసిన పనికి నెట్టింట్లో ఒకటే తిట్ల వర్షం కురుస్తోంది..

Viral News: అది కారా.. లేక టపాసుల దుకాణమా.. రోడ్డుపై వెళ్తూ వీరు చేసిన పని తెలిస్తే..

రానురాను కుర్రాళ్ల పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. సామాజిక భాద్యత ఏమాత్రం లేకుండా యువత చేసే పనులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఎవరికైనా ఏమైనా అవుతుందనే కనీస స్పృహ వారికి ఉండకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. యువత చేసే వెర్రి పనులకు సంబంధించి ఎన్నో సంఘటనలు బయటకొస్తుంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. కొందరు కుర్రాళ్లు కారులో వెళుతూ చేసిన పని చూసి నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీళ్లకు ఏమాత్రం సామాజిక భాద్యత లేదంటూ తిట్టిపోస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

హర్యానా(Haryana) రాష్ట్రం గురుగ్రామ్ లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కొందరు కుర్రాళ్లు కారులో వెళుతూ కారులోంచి పటాసులు పేల్చడం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. గురుగ్రామ్ రహదారిలో ఓ కారు వేగంగా వెళుతుండగా కారులోని యువకులు వెర్రి చేష్టకు పాల్పడ్డారు. కారు పైకప్పు ప్రాంతం నుండి పటాసుల మోత మోగిపోయింది. కారులో కూర్చున్న యువకులు కారు పైకప్పు నుండి పటాసులు పేలుస్తోంటే రంగురంగుల కాంతిలో పటాసులు పైకి ఎగసిపడుతుండటంతో ఆ రహదారిలో ప్రయాణించేవారు భయపడిపోయారు. మరొక విస్తుపోయే విషయం ఏమిటంటే గత ఏడాది కూడా గురుగ్రామ్ లో ఇలాంటి సంఘటన జరిగింది. రహదారి మీద వేగంగా వెళ్తున్న కారు పైకప్పు నుండి పటాసులు పేల్చిన తరువాత పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఈ సారి ఈ నిర్వాకానికి పాల్పడ్డవారు ముందుజాగ్రత్త తీసుకున్నారు. కారు నెంబర్ కనిపించకుండా కవర్ చేసి పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. కానీ వీడియో ఆధారంగా పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Money Earning Tips: జీరో పెట్టుబడి.. నెలకు రూ.లక్షకు పైగానే లాభం.. ఇదేం వింత వ్యాపారం అని డౌటా..? అసలు కథేంటంటే..!



ఈ సంఘటన పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ నిర్వాకానికి పాల్పడిన కుర్రాళ్ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'అది కారా.. లేక పటాసుల దుకాణమా?' అని ఒకరన్నారు. 'పటాసులు కాల్చేవారి వంతు పూర్తయింది, ఇక పోలీసుల వంతు ఇప్పుడు' అని మరొకరు అన్నారు. 'వారికి సామాజిక భాద్యత లేదు, చాలా కఠినమైన శిక్ష విధించాలి' అని ఇంకొకరు అన్నారు.

Health Tips: భోజనం తరువాత స్వీట్లు తింటే ఆ మజానే వేరు.. కానీ ఈ నిజాలు తెలిస్తే..


Updated Date - 2023-10-20T11:38:46+05:30 IST