Home » Haryana
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో స్కూళ్లకు 15 రోజులు సెలవులు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనవరి 16 నుంచి మళ్లీ పాఠశాలల్లో రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రొకబడ్డీ లీగ్ టైటిల్ పోరుకు పట్నా పైరేట్స్, హరియాణా స్టీలర్స్ అర్హత సాధించాయి.
గురుగావ్ నివాసంలో గుండెపోటు రావడంతో ఓం ప్రకాష్ చౌతాలాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ తుదశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.
ఖనౌరీలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న దలేవాల్ను టికాయత్ గత వారంలో కలుసుకున్నారు. 70 ఏళ్ల కేనర్స్ పేషెంట్ అయిన దలేవాల్ నవంబర్ 26వ తేదీ నుంచి పంజాబ్-హర్యానా కనౌరి సరిహద్దు ప్రాంతం వద్ద ఆమరణ దీక్షలో ఉన్నారు.
కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని శంభు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
హర్యానా నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా రేఖాశర్మ నిలబడ్డారు. రేఖాశర్మకు పోటీగా ఎవరూ నామిషన్ వేయకపోవడంతో ఆమె గిలిచినట్టు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
హర్యానాలోని పానిపట్లో 'బీమా సఖి స్కీమ్'ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. మహిళా సాధికారత దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ స్కీం వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఒక ప్రత్యేకత కూడా ఉందని, భారతీయ గ్రంథాలు తొమ్మిదో సంఖ్యను అత్యంత శుభప్రదంగా భావిస్తాయని, 9వ సంఖ్య దుర్గామాత శక్తికి తార్కాణమని, సాధికారత, శక్తికి సంకేతమని ప్రధాని మోదీ చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది.
కదులుతున్న కారు టాపుపై కూర్చుని వీడియోలకు ఫోజిచ్చిన ఓ పోలీసు అధికారి కుమారుడి వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. హర్యానాలో వెలుగు చూసిన ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది.