Viral News: UPSC ఇంటర్యూ ప్రశ్న గురించి IFS ఆఫీసర్ పోస్ట్.. మీరేం సమాధానం చెబుతారంటూ ఛాలెంజ్.. ఇంతకీ ఆయన సమాధానం ఏమిటంటే..

ABN , First Publish Date - 2023-06-07T10:47:57+05:30 IST

ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ తను యూపీయస్సీ ఇంటర్యూలో ఎదుర్కొన్న ప్రశ్నను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఈ ప్రశ్నకు మీరైతే ఏం సమాధానం ఇస్తారు' అంటూ యువతకు ఛాలెంజ్ విసిరారు.

Viral News: UPSC ఇంటర్యూ ప్రశ్న గురించి IFS ఆఫీసర్ పోస్ట్.. మీరేం సమాధానం చెబుతారంటూ ఛాలెంజ్.. ఇంతకీ ఆయన సమాధానం ఏమిటంటే..

UPSC సాధించడం ఎంతో మంది కల. పరీక్షలకు చదవడం, ఎగ్డామ్ రాయడం ఒకెత్తు అయితే ఇంటర్యూలు మాత్రం చాలా విభిన్నంగా ఉంటాయి. ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ తను యూపీయస్సీ ఇంటర్యూలో ఎదుర్కొన్న ప్రశ్నను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఈ ప్రశ్నకు మీరైతే ఏం సమాధానం ఇస్తారు' అంటూ యువతకు ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈయన ప్రశ్న గురించే చర్చ నడుస్తోంది. ఎంతో మంది తమ సమాధానం ఇదంటూ స్పందిస్తున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రతి సంవత్సరం భారతదేశంలో లక్షలాది మంది యూపీయస్సీ కి(UPSC) సంసిద్దమవుతుంటారు. వీరిలో రాత పరీక్షలో ఎంపికై ఇంటర్యూ వరకు వెళ్లేవారు తక్కువమంది. అయితే ఆ ఇంటర్యూలో ఎలాంటి ప్రశ్నలు(UPSC interview Questions) అడుగుతారనేది ఊహించడం కష్టం. కేవలం పుస్తక జ్ఞానం మీదనే కాకుండా సమయస్పూర్తి, తెలివితేటలు, ఆలోచనాతీరు, సామాజిక విషయాల మీద కూడా ఇంటర్యూ ప్రశ్నలుంటాయి. 'పర్వీన్ కస్వాన్' అనే ఐఎఫ్ఎస్ అధికారి(IFS Officer) ట్విట్టర్ వేదికగా తన యూపీయస్సీ ఇంటర్యూ ప్రశ్నను షేర్ చేశారు. 'దేశం పేదరికంతో పోరాడుతున్నప్పుడు అంతరిక్షప్రయోగాల కోసం భారతదేశం చేస్తున్న ఖర్చు గురించి మీ అభిప్రాయం ఏంటి?' అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఈ ప్రశ్నకు ఇంటర్యూ అభ్యర్థిగా ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. 'సార్ మీరు అడిగిన రెండూ పోటీ స్వభావంతో ఉన్నవి కాదని అనుకుంటున్నాను. 1928లో డాక్టర్ సి.వి రామన్ సముద్రపు నీటి గురించి ఆసక్తికరమైన ఆలోచన బయటపెట్టారు. ఈరోజు అదే రామన్ కనిపెట్టిన స్పెక్ట్రోస్కోపీ(spectroscopy) వైద్యశాస్త్రంతో సహా అనేక రంగాలలో ఎక్కువగా ఉపయోగించబడుతోంది. ప్రతి పరిశోధనా విలువైనదే.. దాని ఫలితం రావడానికి సమయం పడుతుంది అంతే..' అని సమాధానం ఇచ్చారు. ఆయన తన సమాధానాన్ని వెలిబుచ్చిన తరువాత 'మీరైతే ఏం సమాధానం చెబుతారు?' అని ట్విట్టర్ లో తనను ఫాలో అవుతున్న వారికి ఛాలెంజ్ విసిరారు.

Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడితే జరిగేదేంటి..? అసలు రెండు మూడు క్రెడిట్ కార్డులు ఉండటం మంచిదేనా..?


ఈ ప్రశ్నను ట్విట్టర్ లో Praveen Kaswan, IFS అనే తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ ప్రశ్నను థర్డ్ బోర్డ్ మెంబర్ అడిగినట్టుగా ఆయన చెప్పారు. ఈ ప్రశ్న చూసిన ఆయన అనుచరులు(Twitter followers) తమకు తోచినవిదంగా స్పందిస్తున్నారు. 'కచ్చితమైన వాతావరణ అంచనాకు సహాయపడే జియా శాటిలైట్ ల గురించి నేను ఉదాహరణ ఇస్తాను' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇలాంటి అంతరిక్ష పరిశోధనల ఖర్చులు తగ్గించడం వల్ల పేదరికం తొలగదు. పేదవారు ఎక్కువగా నైపుణ్యాలు లేనివారు కాబట్టే వారు పేదలుగా ఉండిపోతున్నారు. మన విద్యావ్యవస్థ కూడా లోపభూయిష్టంగా ఉండటం ఇందుకు కారణం' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'ఇస్రో ప్రయోగాలు అంతిమంగా రైతులకు కూడా చాలా మేలు చేస్తాయి' అని మరికొందరు అంటున్నారు.

ATM Card: ఏటీఎం కార్డులపై కనిపించే 16 అంకెల సంఖ్యకు అర్థమేంటి..? 16వ స్థానంలో ఉండే అంకెతో అసలేం తెలుస్తుందంటే..!


Updated Date - 2023-06-07T10:47:57+05:30 IST