Viral News: ఇదేం డిజైన్ బాబోయ్.. కొంపదీసి ఇది బెల్టు కాదు కదా..? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన డ్రస్సు..!
ABN , First Publish Date - 2023-09-20T15:38:25+05:30 IST
ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కేకొద్ది కొత్త కొత్త వస్త్రాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని ఆకట్టుకుంటే మరికొన్ని విమర్శలకు నోచుకుంటాయి.
ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కేకొద్ది కొత్త కొత్త వస్త్రాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని ఆకట్టుకుంటే మరికొన్ని విమర్శలకు నోచుకుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ డ్రస్సు గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు మొదట అవాక్కవుతున్నారు. 'అసలింతకూ ఇది ఏం డ్రస్సు? బెల్టా లేకా షార్టా?' అని అయోమయానికి లోనవుతున్నారు. ఈ డ్రస్సు గురించి ఒకటే సెటైర్లు వేస్తున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఫ్యాషన్ ప్రపంచం(fashion) చాలా విస్తారమైంది. విభిన్న రకాల వింత దుస్తులు మార్కెట్లో కనిపిస్తూ ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. జరా స్టోర్(Zara store) లో అలాంటి వింతే కనిపించింది. జరా స్టోర్ లో దుస్తుల షాపింగ్ కోసం ఓ మహిళ తిరుగుతుండగా ఓ వింత డ్రస్సు కనిపించింది. ఆ డ్రస్సుకు కేవలం జీన్స్ ప్యాంట్ నడుముకు ఉండే పట్టీలు మాత్రమే ఉన్నాయి. ఇవి డెనిమ్ బెల్ట్ తో రూపొందించబడ్డాయి. ఈ బెల్ట్ ఒకదాని కింద ఒకటి నిలువుగా పొరలు పొరలుగా మూడు వరుసలలో ఉన్నాయి. దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే అందులో ప్రతి వరుస అటూ ఇటూ ఊగుతూ కనిపిస్తుంది. దీనికి లోపల కనీసం ఎలాంటి ఫ్యాబ్రిక్ లేదు. ముందుభాగంలో జీన్స్ ప్యాంట్ కు ఉన్నట్టే బటన్ ఉంది. 'అసలు ఇది ఏం డ్రస్సు? నిజంగా డ్రస్సేనా లేక బెల్టా?' అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని ధర చూస్తే దిమ్మతిరిగిపోతుంది. దీని ధర అక్షరాలా రూ.2,290. ఇందులో ఏముందని అంత ధర పెట్టాలో అని దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ బుర్ర గోక్కుంటున్నారు. కొందరు దీనిని లోదుస్తులు అని అంటుంటే మరొకరు కాదు ఇది షార్డ్ అని అంటున్నారు.
Job Notification: వీళ్లకు కావాల్సింది ఉద్యోగులు కాదు.. బానిసలు అంటూ నెటిజన్ల ఆగ్రహం.. ఆ కంపెనీ జాబ్ ప్రకటన చూసి..!
ఈ వీడియోను nikitaghosh07 అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'పాశ్చాత్య సంస్కృతికి చెందిన వస్త్రాలు ఇవి. ఇందులో సంతోషంగా నగ్నంగా కనబడమని వారు చెబుతారు' అంటూ పాశ్చాత్య ఫ్యాషన్ గురించి సెటైర్ వేశారు ఒకరు. 'ఊర్వి జావెద్ కు ఈ డ్రస్ చాలా ఫేవరెట్ గా నిలుస్తుంది' అని ఇంకొకరు అన్నారు. 'బ్రాండ్ పేరుతో అందరూ మోసపోతారు. అసలు అక్కడ బ్రాండ్ అని చెప్పుకొవడానికి ఏముంది? కనీసం దుస్తులను డిజైన్ చేయడానికి క్లాత్ ఉపయోగించారా ఏమైనా?' అని మరొకరు విరుచుకుపడ్డారు. 'ఆ బ్రాండ్ వారు దానిని ధరించే వీడియో ముందుగా ఇస్తే బాగుండు ' అని మరొకరు అందులో ఉన్న అసభ్యతను ఎత్తిచూపారు.