Viral News: ఈ ఫొటోలోని రాయి నీళ్లల్లో ఉందా..? గాల్లో తేలుతోందా..? చూడగానే చెప్పగలిగితే మీరు గ్రేటే..!

ABN , First Publish Date - 2023-06-06T17:20:20+05:30 IST

చెప్పుకోండి చూద్దాం అని, కనిపెట్టండి చూద్దామని మెదడుకు పని పెట్టే ఛాలెంజ్ లు చాలానే చూసుంటాం. కాలంతో పాటు ఇవి కూడా అప్డేట్ అయ్యాయి. డిజిటల్ స్క్రీన్ మీద ఫోటోల రూపంలో అందరికీ సవాల్ విసురుతున్నాయిప్పుడు. ఒక ఫోటో గురించి నిజం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు అందరూ..

Viral News: ఈ ఫొటోలోని రాయి నీళ్లల్లో ఉందా..? గాల్లో తేలుతోందా..? చూడగానే చెప్పగలిగితే మీరు గ్రేటే..!

చెప్పుకోండి చూద్దాం అని, కనిపెట్టండి చూద్దామని మెదడుకు పని పెట్టే ఛాలెంజ్ లు చాలానే చూసుంటాం. కాలంతో పాటు ఇవి కూడా అప్డేట్ అయ్యాయి. డిజిటల్ స్క్రీన్ మీద ఫోటోల రూపంలో అందరికీ సవాల్ విసురుతున్నాయిప్పుడు. వీటిని చూస్తుంటే మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి. మరీ ముఖ్యంగా కొన్ని చిత్రాలు అంత సులువుగా అర్థం కావు, చూస్తున్నది నిజమా కాదా అనే విషయం టక్కున చెప్పడం కష్టం. కళ్ళకు, మెదడుకు పని పెట్టే ఈ రకమైన ఆప్టికల్ ఇల్యూషన్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. నిజం చెప్పడానికి కిందా మీదా అయిపోతుంటారు అందరూ. ఇప్పుడు అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఒకటి సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీని గురించి నిజం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. అందరినీ ముప్పు తిప్పలు పెడుతున్న ఈ ఫోటో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఆప్టికల్ ఇల్యూషన్స్(Optical illusions) మెదడుకు, కళ్ళకు చాలా పని పెడతాయి. ఎంతో గమనిస్తే తప్ప వాటి గురించి నిజం చెప్పడం కష్టం. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. పోటోలో ఒక పెద్ద రాయి(big stone) ఉంది. అది నేలనుండి ఎత్తులో గాల్లో తేలుతూ(stone Floating in the air) కనిపిస్తోంది. నేలమీద కొన్ని గడ్డి మొక్కలు(grass plants) ఉన్నాయి. అయితే ఆ రాయి నిజంగా గాలిలో తేలుతోందా లేదా నీళ్ళలో తేలుతోందా అనేది ఇక్కడ అర్థం కావడంలేదు. చాలామంది రాయి కండీషన్ క్లియర్ గా చెప్పడానికి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొందరు నీళ్ళలో ఉందని చెబుతోంటే మరికొందరు గాలిలో తేలుతోంది అని అంటున్నారు. చూడటానికి గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అంతలోపే నీటిలో ఉందేమో అనే సందేహం వస్తుంది. ఈ కారణంగా చాలామంది ఎటూతేల్చుకోలేక బుర్ర గోక్కుంటున్నారు. అయితే రాయి గాలిలో తేలుతున్నట్టు అనిపించినా, సరిగ్గా గమనిస్తే అది నీళ్ళలో తేలుతున్నట్టు(stone floating in water) అర్థమవుతుంది. ఎవరో చెప్పారని తాము చెప్పడం కాకుండా కాసింత లాజిక్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది.

ATM Card: ఏటీఎం కార్డులపై కనిపించే 16 అంకెల సంఖ్యకు అర్థమేంటి..? 16వ స్థానంలో ఉండే అంకెతో అసలేం తెలుస్తుందంటే..!


ఈ ఫోటోను Massimo అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. తమలో ఉన్న తెలివితేటలు అన్నీ ఉపయోగించి ఫోటోలో రాయి కండీషన్ అంచనా వేస్తున్నారు. 'కొంచెం తదేకంగా చూస్తే తప్ప ఆ రాయి నీటిలో ఉన్నట్టు అర్థం కావడం లేదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ రాయి నీళ్ళలో తేలుతోంది గాలిలో కాదు' అని మరికొరు అన్నారు. 'ఆ రాయి నీటిలో తేలుతోందని చెప్పడానికి ఒక ఆధారం ఉంది. రాతిపై నీటి సరిహద్దు కనబడుతోంది చూడండి' అని మరొకరు కామెంట్ చేశారు.

Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడితే జరిగేదేంటి..? అసలు రెండు మూడు క్రెడిట్ కార్డులు ఉండటం మంచిదేనా..?


Updated Date - 2023-06-06T17:24:22+05:30 IST