Viral News: 30 ఏళ్ల జైలు శిక్ష పడింది కానీ.. మూడేళ్లకే జైలు నుంచి బయటకు.. కలలో కూడా ఊహించని కారణంతో రిలీజ్..!
ABN , First Publish Date - 2023-11-15T16:06:26+05:30 IST
ఈ ప్రపంచంలో ఇంత వరకూ ఎక్కడా లేనట్టుగా వింత కారణంతో ఇతను జైలు నుండి విడుదల అయ్యాడు.
చేసిన నేరానికి శిక్ష విధించిడం కోర్టుల పని. చట్టాలు, అందులో పొందుపరిచిన విషయాల ఆధారంగా ఈ శిక్షలు నిర్ణయిస్తారు. ఓ వ్యక్తి తన ప్రియురాలిని ఒకటి రెండు కాదు ఏకంగా 57సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆ పని అతనే చేశాడని నిరూపణ అయిన తరువాత కోర్టు అతనికి 30ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతను శిక్ష అనుభవిస్తుండగా ఈ ప్రపంచంలో ఇంత వరకూ ఎక్కడా లేనట్టుగా వింత కారణంతో న్యాయమూర్తుల ముందుకు వెళ్లాడతడు. న్యాయమూర్తులు అతని సమస్యను విచారించి అతన్ని విడుదల చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత దారుణంగా చంపిన వ్యక్తి ఇంత సిల్లీ కారణంతో విడుదల కావడం ఏంటని పలువురు విస్తుపోతున్నారు. ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..
డిమిత్రి ప్రికానో అనే వ్యక్తి ఇటలీ(Italy)లోని సార్జినియాలో దారుణం చోటుచేసుకుంది. 2017లో డిమిత్రి ప్రికానో తన ప్రియురాలు ఎరికా ప్రీతి తో కలసి విహారాయాత్రకు వెళ్లాడు. అక్కడ అతనికి , ప్రీతికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆహారం విషయంలో వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా గొడవగా మారింది. ఈ గొడవలో ప్రీతి తన చేతిలో ఉన్న పేపర్ వెయిట్ ను డిమిత్రి మీదకు విసిరింది. దీంతో కోపంలో ఉన్న డిమిత్రి ప్రికా తనకు అందుబాటులో ఉన్న కత్తితో ప్రీతిని 57సార్లు కసితీరా పొడిచి హత్య చేశాడు. అనంతరం తనకేం తెలీదని, తమ మీద ఎవరో దాడి చేసి ఆ హత్య చేశారని బుకాయించాడు. కానీ పోలీసుల విచారణలో అతనే ఆ హత్య చేశాననే విషయం ఒప్పుకున్నాడు. ఇతన్ని కోర్టులో హాజరు పరచగా కోర్టు విచారణ అనంతరం 2019లో అతనికి 30ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పయితే ఇచ్చింది కానీ అతను జైలుకెళ్లాల్సిన సమయానికి ఖచ్చితంగా కోవిడ్ తన ప్రపంచ దేశాలను వణికించడం మొదలు పెట్టింది. దీంతో అతను జైలుకు వెళ్లలేకపోయాడు.
ఇది కూడా చదవండి: Online Dating: ఎవరితో పడితే వారితో డేటింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఓ యువతి పిలిచింది కదా అని వెళ్లిన యువకుడికి ఏమైందంటే..!
కోవిడ్ ప్రభావం తగ్గిన తరువాత 2022 ఏప్రిల్ లో ఇతన్ని జైలుకు తరలించారు. ఆ సమయంలో అతని బరువు 118కిలోలు. 2022 ఏప్రిల్ నుండి ఇప్పటికి అతని బరువు అనూహ్యంగా 200కిలోలకు పెరిగింది. జైలులో ఇస్తున్న అధిక కేలరీల ఆహారమే దీనికి కారణమని, ఆ ఆహారం మరికొన్నాళ్లు తీసుకుంటే నడవడమే కష్టమైపోతుందని, అప్పుడు వీల్ చైర్ లో తిరగాల్సి వస్తుందని అతను తన వైద్యుడితో, న్యాయవాదితో కలసి కోర్టులో వాదన వినిపించాడు. అతని అధిక బరువు(over weight) పరిస్థితికి జైలు జీవితం చాలా ఇబ్బందిగా మారుతుందని ఆధారాలు చూపించాడు. డిమిత్రికి ఆందోళన, డిప్రెసివ్ బులీమియా సిండ్రోమ్, పర్సనాలిటీ డిజార్ఢర్ వంటి సమస్యలున్నాయని, అతని మానసిక పరిస్థితి బాలేదని కోర్టులో వాదించాడు. అవన్నీ పరిశీలించిన కోర్టు అతన్ని రిలీజ్ చేసింది. అయితే అతను జైలు నుండి రిలీజ్ అయినా తన తల్లిదండ్రుల ఇంట్లో నిర్భంద జీవితాన్ని గడపాలని సూచించింది. తల్లిదండ్రుల దగ్గర తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటూ తన శిక్షను పూర్తీ చెయ్యాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు విన్న తరువాత మరణించిన ప్రీతి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. తమ కూతురు మరణానికి కారణమైనవాడు ఇలాంటి సిల్లీ కారణంతో జైలు నుండి విడుదల కావడం సిగ్గుచేటని అన్నారు.