Viral News: బీరువాలో వెతుకుతోంటే బయటపడిందో కాగితం.. 88 ఏళ్ల క్రితం రూ.18 కే ఏం కొన్నారో చూసి అవాక్కవుతున్న జనం..!
ABN , First Publish Date - 2023-06-20T12:40:15+05:30 IST
1933 సంవత్సరంలో 18రూపాయలకు కొనుగోలు చేసిన ఆ వస్తువేంటో తెలిసి నెటిజ్లను షాకవుతున్నారు..
పెద్దవాళ్ళు చాలా చాదస్తులు అంటూ ఉంటాం. దానికి తగినట్టే కరెంట్ బిల్ పేపర్ నుండి, పాలబిల్లుతో సహా ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉంచుతుంటారు. ఇంట్లో బీరువాలు. అల్మారా సొరుగులు సర్దుతున్నప్పుడు, ఏదైనా వెతుకుతున్నప్పుడు పాత పేపర్లు, పాత ఫోటోలు దొరుకుతూ ఉంటాయి. నలభై, యాభై సంవత్సరాల క్రితంకు సంబంధించిన కొన్నివిషయాలు ఇలాంటి సందర్భాలలో బయటపడుతుంటాయి. ఓ వ్యక్తి తన ఇంట్లో బీరువాలో ఏదో వెతుకున్నాడు. అతనలా వెతుకుతోంటే అతనికి ఓ కాగితం కనిపించింది. కాగితం పాతగా ఉండటంతో అదేంటా అని విప్పి చూశాడు. అలా చూసిన అతనికి పెద్ద షాక్ తగిలింది. '90ఏళ్ళ క్రితం 18రుపాయల కొనుగోలుకు సంబంధించిన ఈ బిల్ పేపర్ నాకు దొరికింది' అంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ బిల్ పేపర్ తో పాటు, ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..
పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తపరులు. ప్రతిదీ ఎంతో జాగ్రత్తగా ఉంచుతుంటారు. అందుకే ప్రతి ఇంట్లో ఏ సర్టిఫికేట్, డాక్యుమెంట్, పేపర్ కనిపించకపోయినా మొదట వాళ్ళను అడుగుతుంటాం. ఇవిమాత్రమే కాదు, ఏ వస్తువు కొనుగోలు చేసినా దానికి చెల్లించిన నగదు రశీదును(bill papers) చాలా జాగ్రత్తగా ఉంచుతుంటారు. ప్రతి ఇంటి బీరువాలో, అల్మారా సొరగుల్లో ఇలాంటివి అప్పుడప్పుడు దొరుకుతూఉంటాయి. అయితే ఓ వ్యక్తికి ఏకంగా 90ఏళ్ల క్రితంనాటి కొనుగోలు రశీదు(90 years back bill paper) దొరికింది. 1933వ సంవత్సరంలో కలకత్తాలో కుముద్ సైకిల్ వర్క్స్(kumud cycle works) పేరుతో ఉన్న షాప్ లో ఓ సైకిల్ కొనుగోలు చేశారు. ఈ సైకిల్ విలువ అప్పటికి అక్షరాలా 18రూపాయలు(cycle price 18rupees in 1933). కాలంతో పాటు సైకిల్ ధరలు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం సైకిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో బయటపడిన ఈ సైకిల్ బిల్లు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.
Viral Video: మనుషుల్లో దేవుడంటే నువ్వే భయ్యా.. ఎర్రటి ఎండలో ఓ వృద్దుడు రిక్షా లాగుతోంటే చూడలేక ఈ ఆటోవాలా ఏం చేశాడంటే..
ఈ బిల్లుకు సంబంధించిన ఫోటోను Pushpit Mahrotra అనే వ్యక్తి తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశాడు. '90ఏళ్ళ కిందటి సైకిల్ బిల్లు బీరువాలో దొరికింది. అప్పట్లో 18రూపాయలంటే 1800రూపాయలతో సమానం అనుకుంటున్నాను. నిజమేనా?' అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి నెటిజన్లు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'అప్పటికాలంలో బంగారం ధర 10గ్రాములు 28రూపాయలే, దీంతో పోలిస్తే ఆ సైకిల్ ధర చాలా ఎక్కువ' అని ఒకరు కామెంట్ చేశారు. 'అప్పట్లో ఆర్మీ ఛీఫ్ శాలరీ నెలకు 250రూపాయలే, ఇప్పుడు ఆర్మీ చీఫ్ శాలరీ 2లక్షలకు పైమాటే' అని ఇంకొకరు కామెంట్ చేశారు. దీన్ని బట్టి అప్పటికి సైకిల్ ధర ఎక్కువే అని అంటున్నారు.