Viral News: ఇంజనీరింగ్ చదివి ఇదేం పనని అడిగితే.. ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పింది విని నోరెళ్ల బెట్టిన మహిళ.. నిజమేనా అని ఆరా తీస్తే..!
ABN , First Publish Date - 2023-08-09T14:26:17+05:30 IST
రఘువరన్ బి.టెక్ సినిమా చూసినవారికి ఇంజనీరింగ్ చదివిన కుర్రాళ్లు పడే కష్టాలేంటో అర్థమై ఉంటుంది. ప్రతి ఏటా లక్షలమంది ఇంజనీరింగ్ పూర్తీ చేస్తోంటే ఉద్యోగాలు మాత్రం కొందరికే వస్తుంటాయి, కానీ ఈ క్యాబ్ డ్రైవర్ మాత్రం చేతులారా మంచి ఉద్యోగాన్ని వదిలేసి ట్యాక్సీ డ్రైవర్ గా మారాడు. కారణమేమిటంటే..
పెద్ద పెద్ద నగరాల్లో ప్రయాణించడానికి చాలామంది క్యాబ్ ల మీద ఆధారపడతారు. ఇదే విధంగా ఓ మహిళ కుడా క్యాబ్ ను బుక్ చేసుకుంది. ఆమె తన ప్రయాణంలో క్యాబ్ డ్రైవర్ ను ఏం చదువుకున్నావని ప్రశ్నించింది. అతను ఇంజనీరింగ్ చదివానని చెప్పడంతో ఆమె షాక్ కు గురైంది. చేతిలో ఉన్న మంచి ఉద్యోగాన్ని వదిలేసుకుని మరీ క్యాబ్ డ్రైవర్ గా మారిన ఇతని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇంజనీరింగ్ చదివి ఎందుకు క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తావని అడిగితే అతను చెప్పిన సమాధానమే ఈ చర్చకు మూలకారణం. ఈ వార్తకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
రఘువరన్ బి.టెక్ సినిమా చూసినవారికి ఇంజనీరింగ్ చదివిన కుర్రాళ్లు పడే కష్టాలేంటో అర్థమై ఉంటుంది. ప్రతి ఏటా లక్షలమంది ఇంజనీరింగ్ పూర్తీ చేస్తోంటే ఉద్యోగాలు మాత్రం కొందరికే వస్తుంటాయి. ఇక కోవిడ్ సృష్టించిన ఆర్థిక మాంద్యం కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికీ కోల్పోతున్నారు కూడా. క్యాబ్ లు, ఆటోలు నడిపేవారందరూ సరిగా చదువు లేక ఉద్యోగాలు సంపాదించలేక ఇలా డ్రైవింగ్ అవతారమెత్తుతారని అనుకుంటారు. కానీ ఉద్యోగం ఉన్నా దాన్ని చేతులారా వదిలేసి మరీ క్యాబ్ డ్రైవర్ గా మారాడొక ఇంజనీర్(engineer become cab driver). శ్వేత కుక్రేజా అనే ఓ మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ ఆమెను పికప్ చేసుకుని గమ్యస్థానం వైపు వెళుతుండగా ఆమె అతనితో మాటలు కలిపింది. ఈ మాటల్లోనే అతని గురించి తెలుసుకుందామని 'ఏం చదువుకున్నావు?' అని ప్రశ్నించింది. 'ఇంజనీరింగ్ చేశాను మేడమ్' అని అతను సమాధానం ఇచ్చాడు. దీంతో ఆమె ఒక్క క్షణం షాక్ కు లోనైంది. 'ఇంజనీరింగ్ చదివిన వాడివి ఏదైనా కంపెనీలో జాబ్ చూసుకోవచ్చు కదా..' అని అభిప్రాయం చెప్పింది. 'నేను క్వాల్ కామ్(Qualcomm) లో జాబ్ చేసేవాడిని కానీ ఆ జాబ్ వదిలేశాను' అని అతను సమాధానం చెప్పాడు. 'అంత మంచి జాబ్ ఎందుకు వదిలేశావు'అని ఆమె తన సందేహం బయటపెట్టింది. 'నాకు కంపెనీలో వస్తున్న జీతం కంటే క్యాబ్ నడపడం ద్వారా వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉంది(cab driver earns more than us based company salaries). దీంతో నేను మళ్ళీ ఏ కంపెనీలోనూ పనిచేయాలని అనుకోలేదు' అని అతను చెప్పుకొచ్చాడు. ఈ మాటలు వినగానే అవాక్కవడం ఆ మహిళ వంతైంది. యూఎస్ కంపెనీలు ఇచ్చే శాలరీలకంటే ఎక్కువ క్యాబ్ డ్రైవర్లు సంపాదిస్తున్నమాట నిజమా? కాదా? తెలుసుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. 'ఇంజనీరింగ్ చదివిన ఓ క్యాబ్ డ్రైవర్ క్వాల్ కామ్ లాంటి సంస్థలో ఉద్యోగం వదిలేసి, క్యాబ్ నడుపుతూ యూఎస్ కంపెనీలు చెల్లించే వేతనం కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు ' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.
Indian Railway; రైల్లో ఏసీ కోచ్‌లో రిజర్వేషన్ టికెట్.. ట్రైన్ రాగానే తన సీటును వెతుక్కుంటూ వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..!
ఈ విషయాన్ని శ్వేతా కుక్రేజా Shweta kukreja తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేసింది. ఈ విషయం చదివిన నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. 'క్వాల్ కామ్ దేశంలో ఎక్కువ ప్యాకేజీ ఇచ్చే కంపెనీలలో ఒకటి. అందులో జాబ్ వదిలేసాడంటే నమ్మకశక్యంగా లేదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'మా ఏరియాలో ఒక వ్యక్తి పానీపూరీ అమ్ముతాడు. అతను నెలకు 3-4లక్షలు సంపాదిస్తాడు. ఈ విషయాన్ని అతనే నాతో చెప్పాడు. అతను చదివింది 6వ తరగతి మాత్రమే' అని మరొకరు కామెంట్ చేశారు. 'ప్రజలు ఇన్నాళ్లు గుర్తింపు పొందిన ఉద్యోగాలు చేయడానికే అలవాటు పడిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మంచి సంపాదన ఉంటే ఏ పని అయినా నిస్సంకోచంగా చేస్తున్నారు' అని మరికొందరు అంటున్నారు.