Viral News: మీ తెలివికి ఓ చిన్న పరీక్ష.. ఈ ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయో లెక్క పెట్టగలరా..? సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు..!

ABN , First Publish Date - 2023-04-16T11:03:03+05:30 IST

చిన్నగానే అనిపిస్తుంది కానీ దీన్ని తేల్చడం అంత ఈజీ కాదండోయ్.

Viral News: మీ తెలివికి ఓ చిన్న పరీక్ష.. ఈ ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయో లెక్క పెట్టగలరా..? సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు..!

ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ(physical work) కంటే మానసిక శ్రమ(Mental work) ఎక్కువగా ఉంటుంది. మెదడును ఎక్కువగా వాడేస్తుంటాం. అయితే ఈ మెదడును ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంచుకోవడానికి మంచి వ్యాయామం(brain exercise) లాగా ఉపయోగపడతాయి కొన్ని పరీక్షలు. చిన్నప్పుడు పజిల్స్, చెప్పుకోండి చూద్దాం అంటూ ఎంతో సరదాగా చేసి ఉంటాం కాదా అలాంటిదే ఇది కూడా. మీ తెలివికి చిన్న పరీక్ష.. చిన్నగానే అనిపిస్తుంది కానీ దీన్ని తేల్చడం అంత ఈజీ కాదండోయ్. బాగా ప్రయత్నించి.. సమాధానం ఇదే అనిపించాకా దీని గురించి చదవండి.. మీ బ్రెయిన్ పవర్ ఎంతో మీకే అర్థమైపోతుంది.

కొన్నివిషయాలు చూడగానే చాలా ఈజీ అనిపిస్తాయి. కానీ లెక్క తేలుద్దామంటే కష్టపడాల్సి ఉంటుంది(Difficult to clear). దానికోసం కాస్త బుర్ర ఉపయోగించాల్సిందే..ఆ బుర్రను కూడా కన్ఫ్యూజ్ చేసేస్తుంది ఈ ఫోటో.. ఒక ఎగ్ ట్రేలో(Egg tray) కొన్ని ఎగ్స్ ఉన్నాయి. అని ఎన్నున్నాయో చెప్పాలి.. ఓస్ ఇంతేనా చిటికెలో చెప్పేస్తాం అని అనుకుంటారేమో.. కానీ చతికిలబడతారు ఖచ్చితంగా.. నాలుగు నిలువు వరుసలు, నాలుగు అడ్డు వరుసలు కలిగిన ట్రేలో గుడ్లను వరుసగా పేర్చారు. నాలుగు అడ్డువరుసలు, నాలుగు నిలువు వరుసలు 4*4= 16గుడ్లు, ఆ తరువాత మూడు గుడ్లతో మూడు వరుసలు పేర్చారు. 3*3= 9, ఆ తరువాత 2*2= 4, ఫైనల్ గా వాటిమీద పైన ఒక గుడ్డు ఉంది. ట్రేలో మొత్తం గుడ్ల సంఖ్య 30. లెక్క తెలిసిపోయాక ఇంత సులభమా ఇది అనిపిస్తుంది. కానీ.. మొదట్లో మాత్రం కాస్త తడబడి, ఊగిసలాడి ఉంటారు. గణితంలో ఉన్న గమ్మత్తు ఇంతే మరి. ఇంతకూ మరి అంతే లెక్క వేశారా లేదా చతికిలబడ్డారా?

Wife: భార్యకు ప్రభుత్వోద్యోగం వచ్చిందని సంతోషించాల్సింది పోయి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఒంటి చేత్తోనే ఆమె విధులు నిర్వహించడం వెనుక..!


Updated Date - 2023-04-16T11:03:03+05:30 IST