Viral News: మోడల్ కావాలనే ఆశతో ఫోటో షూట్ లో ఫోజులిచ్చిన యువతి.. ఫోటోగ్రాఫర్ చేసిన నిర్వాకంతో షాక్.. అతనేం చేశాడంటే..
ABN , First Publish Date - 2023-05-08T17:47:54+05:30 IST
అతను ఆమె చెప్పినట్టే ఆమెకు ఫోటోలు తీశాడు. ఆ తరువాత ఆ ఫోటో గ్రాఫర్ చేసిన నిర్వాకం తెలిసి..
మారుతున్న కాలంను బట్టి చాలామంది అమ్మాయిల ఆలోచన, అభిరుచి కూడా మారుతోంది. ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కేవలం ధనిక కుటుంబానికి చెందిన వారే ఉంటారని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సాధారణ అమ్మాయిలు కూడా సినిమా రంగంలోనూ, ప్యాషన్ ప్రపంచంలోనూ తమదైన ముద్ర వేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకమ్మాయి మోడల్ కావాలని ఆశ పడింది. దాంతో ఒక ఫోటోగ్రాఫర్(photographer) ను కలుసుకుని తనకు ఫోటో షూట్(Photo shoot) ఏర్పాటుచేయమని అడిగింది. అతను ఆమె చెప్పినట్టే ఆమెకు ఫోటోలు తీశాడు. ఆ తరువాత ఆ ఫోటో గ్రాఫర్ చేసిన నిర్వాకం తెలిసి ఆ అమ్మాయి షాకైంది. ఇంతకీ అతనేం చేశాడు? ఆ అమ్మాయికి ఎదురైన పరిస్థితి ఏంటి పూర్తీగా తెలుసుకుంటే..
అమెరికా దేశం(America) ఉటా(Uta)లో సావా అనే అమ్మాయి నివసిస్తోంది. ఆమెకు మోడల్ కావాలన్నది(dream to become a model) కల. అందుకోసం ఆమె ఒక ఫోటోగ్రాఫర్ ను సంప్రదించి తనకు ఫోటో షూట్ చేయమని అడిగింది. సావా వయసు 19ఏళ్లు, ఎంతో అందంగా కూడా ఉంటుంది. దీంతో ఆమెను చూసి ఆ ఫోటోగ్రాఫర్ ఇంప్రెస్ అయ్యాడు. ఆమెకు ఫోటోషూట్ ఏర్పాటుచేశాడు. ఫోటోషూట్ లో సావా చిట్టిపొట్టి దుస్తులేసుకుని(short clothes) చాలా హాట్ గా పోజులిచ్చింది. ఫోటోగ్రాఫర్ వాటిని చక్కగా క్లిక్ మనిపించాడు. ఆ తరువాత ఆ ఫోటోస్ ను సావాకు అందించాడతను. ఇది జరిగిన కొన్నిరోజులకు సావాకు తన స్నేహితులు కాల్ చేసి 'నీ పోటోస్ అడల్ట్ సైట్ లో ఉన్నాయి' అనే విషయం చెప్పారు. ఆ మాట వినగానే సావాకు షాక్కొట్టినంత పనయింది. తన ఫోటోలు సైట్ లో ఎవరు పెట్టారని ఆరా తీయగా.. ఫోటో షూట్ చేసిన ఫోటోగ్రాఫర్ ఆ పని చేశాడని తేలింది.
Tea: టీ తాగడానికి ముందు, తాగిన తరువాత నీళ్ళు తాగుతుంటారా? దానివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..
సావా ఫోటోగ్రాఫర్ మీద చట్టపరమైన చర్యలు(legal actions) తీసుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఫోటోషూట్ సమయంలో అతనితో ఆమె ఎలాంటి లిఖితపూర్వక ఒప్పందం(written agreement) చేసుకోకపోవడం వల్ల అతన్ని ఏమీ చేయలేకపోయింది. అయితే 'అతను చేసిన ద్రోహం వల్ల నేను పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను' అని సావా అంటోంది. ఫ్యాషన్ ప్రపంచం మీద ఇష్టంతో ఎంతో మంది అమ్మాయిలు ఫోటోషూట్ వైపు అడుగులు వేస్తుంటారు, వారందరికీ సావా అవగాహన కల్పిస్తోంది. తనకు జరిగినట్టు మరొకరికి జరగకూడదనేదే తన ప్రయత్నం అని అంటోంది. అమ్మాయిలు ఫోటోషూట్ కు ముందే ఫోటోగ్రాఫర్ తో లీగల్ ఒప్పందాలు చేసుకోవాలని చెబుతోంది. కాగా ఈ సంఘటన తరువాత సావా ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్(content creator) గా పనిచేస్తోంది. ఆమె అందం వల్ల ఆమెకు మోడలింగ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. దీంతో మోడల్ గా సెటిల్(settled as model) అయ్యింది. ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో 1మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.