Viral News: 16ఏళ్ళ వయసులో రెస్టారెంట్లో ప్లేట్లు కడిగే ఉద్యోగం.. రెండేళ్ళ తరువాత యజమానికి దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2023-05-21T14:20:32+05:30 IST
అలా పదోతరగతి పూర్తవ్వగానే ఇలా కాలేజీలో చేరింది. ఒకవైపు కాలేజికి వెళుతూ మరొకవైపు రెస్టారెంట్ లో ఎంగిలి ప్లేట్లు, టీ కప్పులు కడిగే పనిలో చేరింది. కానీ రెండేళ్ళ తరువాత ఆ అమ్మాయి చేసిన పనికి రెస్టారెంట్ యజమానే షాకయ్యాడు.
ఆ అమ్మాయి తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళు కాదు, దీంతో ఆ అమ్మాయి చిన్నతనం ఇబ్బందుల మధ్యనే గడిచింది. అలా పదోతరగతి పూర్తవ్వగానే ఇలా కాలేజీలో చేరింది. ఒకవైపు కాలేజికి వెళుతూ మరొకవైపు రెస్టారెంట్ లో ఎంగిలి ప్లేట్లు, టీ కప్పులు కడిగే పనిలో చేరింది. కానీ రెండేళ్ళ తరువాత ఆ అమ్మాయి చేసిన పనికి రెస్టారెంట్ యజమానే షాకయ్యాడు. యజమానికే షాకిచ్చిన సమంతా అనే అమ్మాయి గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
యూఎస్(US) లోని ఒహియోలో సమంతా ఫ్రై అనే అమ్మాయి నివసిస్తోంది. ఆ అమ్మాయి కుటుంబ అర్థిక పరిస్థితి మరీ అంత గొప్పదేమీ కాదు. దీంతో ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆమె జీవితం గడిచింది. పదోతరగతి పూర్తీ చేసి కాలేజీలోకి చేరినప్పటినుండి సమంతాకు ఆర్థిక భరోసా మీద అవగాహన ఎక్కువైంది. డబ్బు బాగా సంపాదించాలని(Money earning), తరువాత వ్యాపారవేత్తగా ఎదగాలనేది(Become a business women) ఆమె కల. అయితే వ్యాపారానికి పెట్టుబడి చాలా ముఖ్యమని డబ్బు సంపాదన వైపు దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్లో(restaurant ) ఎంగిలి ప్లేట్లు, కాఫీ కప్పులు, వంట(washing plates, vassals, tea cups) పాత్రలు కడిగే ఉద్యోగం చూసుకుంది. ఆమె దాన్ని చిన్నతనంగా ఎప్పుడూ భావించలేదు. పైపెచ్చు తన సంపాదనను చక్కగా పొదుపు చేసుకునేది. దానికి తోడు కాలేజీలో చదువుతున్నందుకు ఆమెకు ఫండ్స్ వచ్చేవి. అవీ, ఇవీ రెండూ కలిపి ఆమె డిపాజిట్ వేసుకుంది. ఆ తరువాత మాములుగానే రెస్టారెంట్ లో పని చేస్తూ కాలేజీకి వెళ్ళసాగింది. ఒకరోజు ఆమె రెస్టారెంట్ లో పనిచేస్తూండగా రెస్టారెంట్ యజమాని రెస్టారెంటును అమ్మడానికి(restuarent sale) ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుంది. రెస్టారెంట్ అమ్మేస్తే తన ఉద్యోగం ఉంటుందో లేదో అని బాధపడింది. కానీ అప్పుడే ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
Health Tips: ముక్కులో రెండు చుక్కల నెయ్యిని రోజూ వేస్తే జరిగేది ఇదా..? ఈ డాక్టర్ చెప్పేది వింటే అవాక్కవడం ఖాయం..!
ఆమె నేరుగా రెస్టారెంట్ యజమాని(restaurant owner) దగ్గరకు వెళ్లి 'ఈ రెస్టారెంట్ ను నేను కొంటాను, నాకు అమ్ముతారా?' అని అడిగింది. ఎంగిలి ప్లేట్లు కడిగి తన దగ్గర జీతం తీసుకునే అమ్మాయి అలా అడుగుతుండటంతో యజమాని ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం యజమానితో 'మీరు రెస్టారెంట్ ను అమ్మాలని అనుకుంటున్నారు కదా.. నేనే ఎందుకు కొనకూడదు అనిపించింది. డబ్బుతో తిరిగి వస్తాను' అని ఇంటికెళ్ళింది. అలా ఇంటికెళ్ళిన అమ్మాయి తన ఫిక్స్డ్ డిపాజిట్ల డబ్బులు(fixed diposite money), తను పొదుపు చేసుకున్న డబ్బులు(savings money) మొత్తం బయటకు తీసి రెస్టారెంట్ కు డౌన్ పేమెంట్ చెల్లించింది.ఆమె ధైర్యానికి రెస్టారెంట్ యజమాని షాకయ్యాడు. రెస్టారెంట్ తాళాలు ఆమె చేతిలో ఉంచి దాన్ని ఆమె పేరున రిజిస్టర్ చేసిచ్చాడు. దీంతో 18ఏళ్ళకే ఆమె రెస్టారెంట్ యజమాని అయ్యింది. ఆ తరువాత రెస్టారెంట్లో రుచికరమైన వంటకాలు తయారు చేసి కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె రెస్టారెంట్ కు బానే ఆదాయం ఉంటున్నట్టు తెలిసింది. 'రెస్టారెంట్ బాధ్యతలు చేపట్టి ఐదు నెలలే అవుతోంది, ముందు ముందు ఎలా నడుస్తుందో చూడాలి' అని 18ఏళ్ళ రెస్టారెంట్ ఓనరమ్మ భవిష్యత్తు గురించి మరీ భయపడక్కర్లేకుండా గెలుపు మీద భరోసాతోనే చెప్పింది. వారంలో ఐదు రోజులు దగ్గరుండి రెస్టారెంట్ ను చూసుకుని, మిగిలిన రెండురోజులు కాలేజీకి వెళుతోందట. కాగా అంత చిన్న వయసులో రెస్టారెంట్ ను కొని వ్యాపారవేత్తగా మారడంతో ప్రజలు సమంతను తెగ పొగిడేస్తున్నారు.