Viral Video: నన్ను ప్రేమించావా..? లేదా..? నిజం చెప్పమంటూ వరుడి ముందే నిలదీసిన ప్రియుడు.. వధువు రెస్పాన్స్ విని..

ABN , First Publish Date - 2023-03-17T18:19:48+05:30 IST

వధువు వరుడి మెడలోపూలహారం వేయబోయే సమయానికి రేసుగుర్రంలా అక్కడికి చేరుకున్నాడు ప్రియుడు

Viral Video: నన్ను ప్రేమించావా..? లేదా..? నిజం చెప్పమంటూ వరుడి ముందే నిలదీసిన ప్రియుడు.. వధువు రెస్పాన్స్ విని..

పెళ్ళిళ్ళు ఎంత సందడిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంత సందడిగా జరిగే పెళ్ళిళ్లలో కొన్నిచోట్ల ఎవరూ ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ సోషల్ మీడియా కారణంగా ఏ సంఘటన అయినా ఎంతో తొందరగా వైరల్ అవుతాయి. ఇప్పుడూ అలానే జరిగింది. తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసి రేసుగుర్రంలా పెళ్ళివేడుకలోకి దూసుకొచ్చాడొక వ్యక్తి. నన్ను ప్రేమించావా..? లేదా? అని వరుడి ముందే నిలదీశాడు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఇప్పటికాలంలో ప్రేమలు కామన్. పెద్దలు వద్దనగానే బుద్దిగా వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు కొందరున్నారు. నేను ప్రేమించిన వ్యక్తినే చేసుకుంటానని ఎదిరించేవాళ్ళు ఉన్నారు. కారణం తెలీదుగానీ.. ఓ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో కాకుండా తల్లిదండ్రులు కుదిర్చిన అబ్బాయిని పెళ్ళిచేసుకోవడానికి సిద్దమయ్యింది. పెళ్ళిమండపంలో వరుడు అమ్మాయి మెడలో పూలహారం వేశాడు. వధువు వరుడి మెడలోపూలహారం వేయబోయే సమయానికి రేసుగుర్రంలా అక్కడికి చేరుకున్నాడు ప్రియుడు. అతను వచ్చీ రాగానే నేరుగా వధువు వైపు చూస్తూ.. 'కాజల్.. నువ్వు నన్ను ప్రేమించావా లేదా? ఇవన్నీ పట్టించుకోవద్దు కాజల్. నువ్వు ఎవరికీ భయపడకు, ఈ సమాజానికి భయపడకు.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాజల్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు.. నువ్వు కూడా అదే మాట చెప్పు కాజల్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాజల్.. ఐ లవ్యూ వెరీ మచ్ కాజల్' అంటూ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్(sunny deol) లాగా సినిమా డైలాగులు చెప్పాడు. ఈ సంఘటనతో వేదిక మీద ఉన్న వరుడు వధువు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. వధువు ఆమె ప్రియుడివైపు చూసి 'నువ్వెవరో నాకు తెలియదు, ప్రేమ లేదు ఏమీ లేదు. నువ్విక్కడినుండి వెళ్ళిపో..' అని సమాధానం ఇచ్చింది.

Anand ki duniya అనే యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియో అప్లోడ్ చేశారు. ఈ పెళ్ళి సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ సంఘటనతో పాటు వివిధ పెళ్ళిళ్ళలో జరిగిన మరిన్ని సంఘటనలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట్లో నవ్వుల జల్లు కురిపిస్తోంది. 'ఇది మరచిపోలేని పెళ్ళి అని ఒకరు, ఈ ప్రేమికుడు సన్నీడియోల్ ఫ్యాన్ లా ఉన్నాడు' అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకా కామెంట్ సెక్షన్ పంచ్ లతోనూ, సెటైర్ లతోనూ మార్మోగిపోతోంది.

Read also: White Hair: రంగు వెంటనే పోతోందా..? తొందరగా తెల్ల జుట్టు బయటపడుతోందా..? ఈ మూడు చిట్కాలను పాటించండి చాలు..!


Updated Date - 2023-03-17T19:06:15+05:30 IST