Share News

Viral Video: ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నావేంటి బ్రో.. టెస్లా కారును ఇతడెలా మార్చేశాడో చూస్తే..

ABN , First Publish Date - 2023-11-16T13:46:29+05:30 IST

టెస్లా కారుతో ఇతను చేసిన ప్రయోగం కాస్తా కార్ల లవర్స్ కు దిమ్మతిరిగే షాకిస్తోంది.

Viral Video:  ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నావేంటి బ్రో..  టెస్లా కారును ఇతడెలా మార్చేశాడో చూస్తే..

కార్లంటే తెగ పిచ్చి ఉన్నవాళ్లు చాలామందే ఉంటారు. చాలామంది మధ్యతరగతి కుటంబాల వారు కూడా ఓ మంచి ఇల్లు, కారు కొనుక్కోవాలని కలలు కంటుంటారు. అయితే కార్ల లవర్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చాడు ఓ వ్యక్తి. టెస్లా కారు టైర్లు తొలగించి అతను చేసిన ప్రయోగం చూస్తే అవాక్కవ్వాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇతగాడి విభిన్న ఆలోచనకు అవాక్కవుతున్నారు. నువ్వింత ట్యాలెంటెడ్ గా ఉన్నావేంటి బ్రో అంటున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

వైవిద్యంగా ఆలోచించకపోతే కొత్త ఆవిష్కరణలు పుట్టవు. ఈ విషయం ఇతనికి బాగా తెలుసేమో టెస్లా కారుతో ప్రయోగం చేశాడు. ఈ మద్యకాలంలో బైకులకు కారు వీల్స్ పెట్టడం, బైక్ ఇంజిన్ లు తీసుకెళ్లి సైకిల్ కు, కార్లకు పెట్టడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాల ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవతున్నారు. ఓ వ్యక్తి మాత్రం టెస్లా(Tesla) కారుకు ఏకంగా జెయింట్ వీల్ చక్రాలు(Gaint wheel tyres) అమర్చాడు. కారు టైర్లను తొలలగించి సుమారు పది అడుగుల ఎత్తు ఉండే జెయింట్ వీల్ చక్రాలను కారుకు అమర్చాడు. ఈ చక్రాలు అమర్చిన తరువాత ఈ కారు భలే వింతగా ఉంది. వీడియోలో కారు స్టార్ట్స్ అవ్వడం చూడవచ్చు. చూస్తుండగానే ఆ కారు చకాచకా దొర్లుకుంటూ ముందుకు వెళుతుంది. దాన్ని చూస్తుంటే రిమోట్ కారు కదిలినట్టుంది. వేగంతో అది దూసుకుపోతుంటే సాలీడు పరుగులు పెడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే దీన్ని తలకిందులుగా కూడా డ్రైవ్ చేయచ్చట. చూడటానికి అయితే బాగుంది కానీ దీంట్లో ప్రయాణించడం ఎంత మాత్రం సురక్షితం అనేది తెలియదు.

ఇదికూడా చజవండి: Raisins: ఎండుద్రాక్ష నానబెట్టి తినాలా?


ఈ వీడియోను Science అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీన్ని చూసి విస్తుపోతున్నారు. పలురకాలుకా కామెంట్స్ చేస్తున్నారు. 'నేను చూసిన వాటిలో ఇదే ఉత్తమ SUV' అని ఒకరు కామెంట్ చేశారు. 'బంగారం లాంటి టెస్లా కారును ఇలా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నయ్యా?' అని ఇంకొకరు అన్నారు. 'అసలు అతను ఆ కారులోకి ఎలా ఎక్కుతాడు? ఎలా దిగుతాడు?' అని మరికొందరు తమ సందేహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Custard Apples: చలికాలంలో సీతాఫలం తింటే కలిగే లాభాలు..

Updated Date - 2023-11-16T13:46:31+05:30 IST