Viral Video: వీటిది ఆటా.. ఫైటా.. అర్థం కాలే.. ఉడుం పట్టు మాములుగా లేదంటున్న నెటిజన్స్

ABN , First Publish Date - 2023-03-02T16:11:55+05:30 IST

మనుషుల్లాగా ఎదురెదురుగా నిలబడుకుని

Viral Video: వీటిది ఆటా.. ఫైటా.. అర్థం కాలే.. ఉడుం పట్టు మాములుగా లేదంటున్న నెటిజన్స్

గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి ఉడుము గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానిటర్ లిజార్డ్(Monitor Lizard) అని పిలిచే ఇవి దేన్నైనా పట్టుకున్నాయంటే విడిపించడం కష్టం. అనుకున్నపని ఎంత కష్టమైనా సరే వదలకుండా చేసేవారిని ఏం ఉడుంపట్టురా బాబు అని అంటుంటారు. అలాగే కుస్తీ పోటీలలో ప్రత్యర్థులను తమ బాహుబలంతో బంధిచినపుడు ఉడుం పట్టు పట్టాడురా.. అని చెబుతారు. అలాంటి ఉడుము మరొక ఉడుముతో కలసి దర్శనమిచ్చింది. మనుషుల్లాగా ఎదురెదురుగా నిలబడుకుని ఇవి కుస్తీ పోటీలో పోట్లాడుకుంటున్నట్టే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ఉడుముల కుస్తీ ఎక్కడ కనబడిందో, వీటి కథేంటో తెలుసుకుంటే..

కోల్కతా(Kolkata)లో ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను స్థానిక IIM క్యాంపస్(Kolkata IIM Campus) లో మార్నింగ్ వాక్(Morning Walk) కు వెళుతుంటాడు. ఎప్పటిలా అతను క్యాంపస్ లో వాకింగ్ చేస్తుండగా ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. రెండు ఉడుములు మనుషుల్లా నిలబడి ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. అవి రెండూ గట్టి పట్టులో ఉన్నట్టు అవి మూవ్ అవుతున్న విధానం చూస్తే అర్థం అవుతుంది. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఉడుములను వీడియో తీశారు. Susanta Nanda అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను పోస్ట్ చేసారు.

Read also: అక్కడ పెళ్ళిలో ఏడడుగులు కాదు ఐదే.. చనిపోయిన వారికి విగ్రహాలు కట్టి బీడి,సిగరెట్,మద్యంతో నైవేద్యం..


ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.అవి రెండు అక్కడి ప్రాంతం కోసం పోట్లాడుకుంటున్నాయని జంతు ప్రవర్తనల గురించి అవగాహన ఉన్న ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. మరొక వ్యక్తి ఆడ, మగ ఉడుములు రెండూ ఆటాడుతున్నట్టున్నాయని అన్నాడు. ఇంకొక వ్యక్తి అవి రెండూ ఆడ ఉడుములే, రెండూ పోట్లాడుకుంటున్నాయి, ఉడుముల జంట అయితే అలా పైకి లేచి ఫైట్ చెయ్యవు అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆ ఉడుముల విన్యాసం మాత్రం అదిరిపోయింది

Updated Date - 2023-03-02T16:14:09+05:30 IST