Viral Video: సడన్‌గా ఇద్దరు మహిళల మధ్యలో వచ్చి కూర్చున్నాడు! ఇతడి తీరు చూసి మెట్రో ప్రయాణికులు షాక్!
ABN , First Publish Date - 2023-10-12T18:30:49+05:30 IST
నుదుట సింధూరం, బిట్టుబిళ్ల, పెదాలకు లిప్‌స్టిక్‌తో ఓ వ్యక్తి మెట్రోలో ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య జనాలు వైరల్ అయ్యేందుకు ఏం చేసేందుకైనా వెనకాడట్లేదు. ఇలాంటి వారికి ఢిల్లీ మెట్రో ఓ వేదికగా మారడం అక్కడి వారికి బాధ కలిగిస్తోంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది ఎదురవుతున్నా పట్టించుకోకుండా వైరల్ అయ్యేందుకు తమ మానాన తాము తింగరి పనుల చేసుకుంటూ వెళుతున్నారు. ఇలాంటి వ్యక్తి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మెట్రోలో అతడు చేసిన పని చూసి ఢిల్లీ వాసులు మండిపడుతున్నారు. ఇలాంటి వారు మెట్రోల్లో ప్రయాణించకుండా నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు(Man travels with sindoor and lipstick and bindi in Delhi metro).
Viral: భలే బైక్..దీని టైర్‌లోపల కూర్చుంటే కానీ బండి నడపలేం! ఈ వైరల్ వీడియో చూస్తే..
ఓ వ్యక్తి అందరిలాగే మెట్రోలోకి ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూడగానే తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఏం మాట్లాడో తెలీక నోరెళ్లబెట్టారు. నుదుటిపైన సింధూరం, బొట్టుబిళ్ల, పెదాలకు లిప్‌స్టిక్ వేసుకుని వచ్చిన అతడు అసలేమీ తెలియనట్టు నిలబడ్డాడు. అందరూ అతడినే చూశారు. ఇంతలో ఈ వెరైటీ వ్యక్తి మరో దారుణానికి పాల్పడ్డారు. ఓచోటు ముగ్గురు మహిళలు కూర్చోగా మధ్యలో ఉన్న మహిళను లేమ్మని చెప్పి తాను కూర్చున్నాడు. దీంతో, పక్కనే కూర్చున్న యువతి అతడిని చూసి తెల్లముఖం వేసింది. వీడియో అక్కడితో ముగియడంతో ఆ తరువాత ఏం జరిగిందో స్పష్టత లేకపోయినప్పటికీ జనాలు మాత్రం సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు.
వైరల్ వీడియోల కోసం కొందరు ఏం చేసేందుకూ వెనకాడరని కొందరు కామెంట్ చేశారు. ఇలాంటి వాళ్లు మెట్రోల్లో ఎక్కకుండా నిషేధించాలని కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం తమకు పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తోందంటూ కామెంట్ చేశారు. కాసేపు అతడు భలే ఎంటర్‌టెయిన్మెంట్ ఇచ్చాడని అభిప్రాయపడ్డారు.