Viral Video: వామ్మో.. ఇదేం పనయ్యా నాయనా..? చిన్న పిల్లాడిని బైక్‌పై వెనుకయినా కూర్చోబెట్టుకోకుండా ఇంత రిస్కేంటి..?

ABN , First Publish Date - 2023-09-19T15:56:50+05:30 IST

కొన్ని సార్లు తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేసే పని సమాజం నుండి విమర్మలు ఎదుర్కొనేలా చేస్తుంది. ఓ తండ్రి తన కొడుకును బైక్ మీద తీసుకెళ్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో.. ఇదేం పనయ్యా నాయనా..? చిన్న పిల్లాడిని బైక్‌పై వెనుకయినా కూర్చోబెట్టుకోకుండా ఇంత రిస్కేంటి..?

పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ బిడ్డలకు ఏ చిన్నప్రమాదం జరిగినా వారి ప్రాణం పోతున్నట్టే విలవిలలాడిపోతారు. పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు ఏ పనైనా చేస్తారు. అయితే కొన్ని సార్లు వారు చేసే పని సమాజం నుండి విమర్మలు ఎదుర్కొనేలా చేస్తుంది. ఓ తండ్రి తన కొడుకును బైక్ మీద తీసుకెళ్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తండ్రి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇదేం పనయ్యా పిల్లాడిని బైక్ పై వెనుక అయినా కూర్చోబెట్టుకోవచ్చు కదా.. ఇంత రిస్క్ చేస్తున్నావేంటి?' అని అంటున్నారు. ఇంత విమర్శలకు కారణం అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని వీడియోలో వ్యక్తులు మతుండే అలా చేస్తున్నారా? అనుకునేలా ఉంటాయి. ముఖ్యంగా ప్రమాదాలకు ఆస్కారం ఉన్న పనులు చాలామంది కోపానికి కారణం అవుతాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. వీడియోలో ఓ పాల వ్యాపారి(dairyman) టీవీఎస్ నడుపుతూ కనిపిస్తాడు. టీవిఎస్ కు వెనుక ఒకవైపుగా ఒక పాల క్యాన్(milk can) తగిలించారు. ఆ క్యాన్ లో ఓ చిన్న బాబు(small kid) ఉన్నాడు. ఆ బాబు ఆ పాల వ్యాపారి కొడుకే అని అర్థమవుతోంది. పిల్లాడిని వెనక కూర్చొబెట్టుకుంటే కుదురుగా ఉంటాడో లేదో అనే భయంతో అతను పిల్లాడిని క్యాన్ లో నిలబెట్టాడు. దీనివల్ల పిల్లాడు సురక్షితంగానే ఉన్నాడు. కానీ చాలామంది ఈ పనిని విమర్శిస్తున్నారు. ఏ మాత్రం సురక్షితం కాదంటున్నారు.

Kidney Cleansing Vegetables: ఎక్కడ చూసినా కిడ్నీ సమస్యలతో ఆస్పత్రి పాలవుతున్న వాళ్లే.. అసలీ రోగానికే చెక్ పెట్టాలంటే..!



ఈ వీడియోను బాలీవుడ్ నటుడు(Bollywood Actor) రితేష్ దేశ్ ముఖ్ Riteish Deshmukh తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. 'జుగాదు బాప్..' అనే క్యాప్షన్ మెన్షన్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి కామెంట్స్ చేస్తున్నారు. 'పిల్లాడు వెనక కూర్చుంటే పడిపోయే ప్రమాదం ఉంది, కానీ పాల క్యాన్ లో పెట్టడం వల్ల పిల్లాడు పడిపోడు. ఆ తండ్రిది తెలివైన ఆలోచన' అని ఒకరు కామెంట్ చేశారు. 'అవసరం కొత్త కొత్త ఆలోచనలు సృష్టిస్తుంది. ఇది కూడా అలాంటిదే' అని మరొకరు కామెంట్ చేశారు. 'అతను పిల్లాడిని ఆ క్యాన్ లో కూర్చోబెట్టడం చాలా ప్రమాదం. పొరపాటున క్యాన్ కింద పడిపోయినా, వేగంగా వాహనాలు ఎదురుగా వస్తున్నప్పుడు పిల్లాడు చేతులు ముందుకు చాపినా అప్పుడు పిల్లాడి పరిస్థితేంటి?' అని మరికొందరు విమర్శిస్తున్నారు.

Health Tips: 35 ఏళ్ల వయసు దగ్గరపడిందా..? ఎంత ప్రయత్నించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదా..? అయితే..!


Updated Date - 2023-09-19T15:56:50+05:30 IST