Viral Video: ప్రాంక్ చేయడమంటే మీకూ సరదానా? ఈ వీడియో చూసిన తరువాత మీ అలవాటు మారిపోతుందేమో..!
ABN , Publish Date - Dec 18 , 2023 | 09:38 AM
ఓ కుర్రాడు పబ్లిక్ లో ఓ వ్యక్తిని ప్రాంక్ చేశాడు. ఆ తరువాత జరిగింది చూస్తే షాకవుతారు.
ఇంటర్నెట్ హవా పెరిగేకొద్ది చాలామంది దాని సహాయంతోనే వైరల్ అవుతున్నారు, డబ్బు కూడా సంపాదిస్తున్నారు. అయితే ఇతరులకు ఇబ్బంది పెట్టనంత వరకు ఏ పని చేసినా బానే ఉంటుంది. కానీ ఇతరులను ఇబ్బంది పెడితే ఆ తరువాత పర్యావసానాలు వేరుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇంట్లో వాళ్ళనే కాకుండా పబ్లిక్ లో అంత వరకు పరిచయం లేనివారితో కూడా ప్రాంక్ చేస్తున్నారు కొందరు. ఓ కుర్రాడు పబ్లిక్ లో ఓ వ్యక్తిని ప్రాంక్ చేశాడు. ఆ తరువాత అక్కడ జరిగిన పరిణామాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. ఈ ప్రాంక్ వీడియో చూశాక ఎవరూ ఎప్పుడూ ప్రాంక్ వీడియోలు చేయరని చాలా మంది అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, ఫేస్ బుక్ వాడకం పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక వీడియో తీయడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ కావడం జరుగుతోంది. ఇలా వైరల్ కావడానికి ఎక్కువ మంది చేస్తున్నపని ప్రాంక్ వీడియోలు(Prank Videos) చేయడం. ఓ కుర్రాడు ఇదే పని చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. వీడియోలో నది మీద కట్టిన ఓ వంతెన కనిపిస్తుంది. ఈ వంతెన గోడలకు దగ్గరగా ఓ వ్యక్తి నిలబడుకుని నదివైపు తిరిగి తన మొబైల్ లో ఏదో సీరియస్ గా చూస్తున్నాడు. ఇదే సమయంలో అతని వెనుక నుండి ఓ వ్యక్తి వచ్చి అతని చెవులలో హార్న్ ఊదుతాడు. ఈ శబ్దానికి నది ఒడ్డున నిలబడ్డ అతను ఉలిక్కిపడ్డాడు. అతని చేతిలో ఉన్న మొబైల్ కూడా నదిలో పడిపోయినట్టుంది. వేరే ఎవరైనా అయితే హార్న్ ఊదిన వ్యక్తిని నాలుగు చివాట్లు పెట్టి వెళ్లిపోయేవారేమో.. కానీ ఇతను మాత్రం బాగా సీరియస్ మనిషిలా ఉన్నాడు. పైపెచ్చు మొబైల్ పడిపోవడం అతనికి కోపం తెప్పించినట్టు ఉంది. ముందే వస్తాదులా ఉన్న అతను వెంటనే హార్న్ ఊదిన వ్యక్తిని తన చేతులతో ఎత్తి నదిలో పడేశాడు.
ఇది కూడా చదవండి: పిల్లలలో మొబైల్ వ్యసనం.. ఈ పనులు చేస్తే మాయం!
ఈ వీడియోను Out of Context Human Race అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'గుండె సంబంధ సమస్యలున్నవారికి ఇలాంటివి ప్రాంక్ లు గుండెపోటు తెప్పించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి చేయకండి' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇతరులను అనవసరంగా ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం?' అని ఇంకొకరు అన్నారు. 'అల్లరికి కూడా ఓ పరిమితి ఉంటుంది. అందరిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు' అని ఇంకొకరు అన్నారు.